జగన్ పని అయిపోయే.. షాకులమీద షాకులిస్తున్న సర్వేలు?

ఎన్నికలకు ఇంకా సమయం వుంది కానీ, ఏపీలో ఎన్నికల వాతావరణం అపుడే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సీఎం జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలని ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. పొత్తులపై పవన్ మాట్లాడుతూ… పొత్తులు ఖాయం అని పరోక్షంగా తెలియజేసారు. మరోవైపు బీజేపీ సైతం జనసేన తమతోనే పొత్తు పెట్టుకుంటుందని.. వచ్చేఎన్నికల్లో బీజేపీ-జనసేనలదే విజయం అంటూ సోమువీర్రాజు పదే పదే చెబుతున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికార పీఠం ఎవరికి దక్కనుంది మరోసారి జగన్ అధికారంలోకి వస్తాడా? లేదా సైకిల్ గేరు మార్చి ఊపందుకుంటుందా? లేదంటే జనసేన – బీజేపీ చక్రం తిప్పనున్నాయా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అనే విషయాలు సర్వత్రా ఉత్కంఠతను రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. అవును, ఇటు ఏపీ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలతో ఆదరణ పెరుగుతున్నప్పటికీ, అదే సమయంలో కొన్ని నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా విపరీతంగా పెరుగుతోంది అని తేటతెల్లమౌతోంది.

ఉద్యోగులు తాజా పీఆర్సీతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తే, నిరుద్యోగులు జాబ్ కేలండర్ లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇక నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్న పరిస్థితి. దాంతో వైసీపీ ప్రభుత్వంపైన జనాలు చాలా అసహనంగా వున్న పరిస్థితి. అయితే ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరి బలం ఎంత అన్నదానిపై తాజా సర్వే ఏం చెబుతోంది అంటే? భారత దేశంలో 2024 ముందు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులోనూ ఏపీలో పార్టీల పైన ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు తాజాగా ఓ సర్వే నిర్వహించడం జరిగింది. అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

సీఎం జగన్ ప్రతిష్టించిన పార్టీ వైసీపీకి ఈసారి 43 శాతం కన్నా తక్కువ ఆధరణ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో జగన్ కి మద్దతు లభించినా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం సర్వేలో 43 శాతం కంటే తక్కువగా మద్దతు రావటం పైన వైసీపీలో ఇపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ సర్వే చెప్పిన ప్రకారం జగన్ – చంద్రబాబు మధ్యనే పోటీ ఎక్కువ ఉంటుదని స్పష్టం అవుతోంది. ఇక జనసేన మరోమారు కింగ్ మేకర్ స్థానానికి పరిమితం కానుంది. అయితే ఈసారి గతంలో కంటే ఓ పది శాతం అంటే దాదాపు 18 శాతం వరకు ఓటు శాతం పెరగొచ్చని అభిప్రాయపపడుతున్నారు. ఆ ఓట్ల శాతం ఇపుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి అనుకూలంగా మారనుంది. అలా మొత్తంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయనుందని తెలుస్తోంది.

https://www.youtube.com/watch?v=wLSqv0PNsI4