గుట్టు చప్పుడుగా జరిగిన ప్రభుదేవా వివాహానికి హాజరైన సూపర్ స్టార్ మహేష్ బాబు?

ఇండియన్ మైఖైల్ జాక్సన్, ప్రముఖ మూవీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా గురించి ఇక్కడ ప్రతేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. శరీరంలో స్ప్రింగ్స్ ఉన్నాయా అన్నట్టు భ్రమింపజేసే ప్రభుదేవా డ్యాన్స్ కి ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు వున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా తన సేవలను అందిస్తున్నాడు. అంతేకాకుండా మరోపక్క హీరోగా దర్శకుడిగా కూడా తన ఉనికిని చాటుకుంటున్న ప్రతిభాశాలి ప్రభుదేవా.

అలాంటి కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు అయినటువంటి ప్రభుదేవా జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన పర్సనల్ లైఫ్ మొత్తం వివాదాలే. ప్రభుదేవా మొదటి భార్య రామ లతా జంటకు ఇద్దరు పిల్లలు కాగా నయనతార ఎంట్రీతో వారిరువురు మధ్య విభేదాలు చెలరేగి విడాకులు తీసుకున్నారు. తరువాత నయన్ తో ప్రేమలో పడ్డ ప్రభుదేవా ఆమెను పెళ్లాడడానికి సిద్ధమైనప్పటికీ కొన్ని అనుకోని కారణాల వలన వీరు కూడా విడిపోయారు.

అయితే, అంతవరకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ట్విస్ట్ ఏమంటే ప్రభుదేవాకు గుట్టు చప్పుడు కాకుండానే వివాహం జరిగిపోయిందని సోషల్ మీడియా కోడై కూసింది. దానికి కారణం తిరుమల తిరుపతి వేదిక అయింది. అవును, కరోనా సమయంలోనే ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడుగా హిమానీ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడట మన డాన్సర్. అయితే ఇప్పటివరకు ఆమె బయట కనిపించింది లేదు. తాజాగా ఈ జంట తిరుమలలో సందడి చేయడంతో గుట్టు రట్టయింది. భార్య చేయి పట్టుకొని ప్రభుదేవా శ్రీనివాసుడి సన్నిధానంలో అడుగులు వేస్తూ కనిపించడంతో మీడియా క్లిక్ అనిపించింది.

ఇక ఆ వివాహం చాలా తక్కువమంది సినీ, రాజకీయ ప్రముఖల మధ్యన జరిగినట్టు భోగట్టా. ఆ ఈవెంట్ కి మన టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరైనట్టు వార్తలు వస్తున్నాయి. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటకు పొక్కింది. అది కూడా ప్రభుదేవా జంట తిరుమల తిరుపతిలో కెమెరాకు చిక్కడంతో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. కాగా ఆమె తన బంధువుల అమ్మాయిని అయినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.