బావ సుధీర్ బాబు కోసం అమెరికా నుండి బైక్ ని దింపిన సూపర్ స్టార్ మహేష్ బాబు?

బావ సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌బాబు తనదైన సినిమాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. అవసరాన్ని బట్టి సుధీర్‌, మహేష్‌ బాబు గురించి, మహేష్ సుధీర్ గురించి మాట్లాడుతూ వుంటారు. తాజాగా సుధీర్ బావ మహేష్‌ బాబు గురించి మాట్లాడుతూ.. కుటుంబాన్ని, సిస్టర్స్‌ను మహేష్‌ బాబు చూసుకున్నట్లు ఎవరూ చూసుకోరు అని వెల్లడించడం జరిగింది. అవును, కుటుంబం తర్వాతే ఏదైనా అనే విధంగా మహేష్‌ ఆలోచిస్తుంటాడని సుధీర్ తెలిపాడు.

ఈ విషయం కూడా అందరికీ తెలిసినదే. మహేష్‌ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబానికి, కుటుంబ బాధ్యతలకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి మహేష్‌కు గత ఏడాది మర్చిపోలేని దెబ్బలు తగిలాయి. మొదట అన్న రమేష్‌బాబు, తరువాత తల్లి ఇందిరా దేవి, ఆ తరువాత తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణించడంతో మహేష్ చాలా బాధకి గురయ్యారు. ఇప్పుడిప్పుడే ఆ భాద నుండి కోలుకుంటున్నాడు. తరువాతనే త్రివిక్రమ్‌తో సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేసారు.

ఇక అసలు విషయానికొస్తే, సుధీర్‌బాబు తాజాగా ఓ కొత్త బైక్ పైన షికార్లు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఘట్టమనేని అభిమానులు ఖుషి అయిపోతున్నారు. విషయం ఏమంటే, ఆ లేటెస్ట్ బైక్ ని సూపర్ స్టార్ మహేష్ తన బావ సుధీర్ కోసం ఫారిన్ నుండి తెచ్చినట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక సుధీర్ ప్రస్తుతం కమర్షియల్‌ హీరోగా గుర్తింపు సంపాదించడం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు.

కెరీర్‌ మొదటినుండి కథా బలమున్న సినిమాలు చేస్తున్న సుధీర్ సినిమాలకు ప్రత్యేక మార్కెట్ వుంది. ఈ క్రమంలో చేసిన ‘సమ్మోహనం’ సినిమా సుధీర్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే చాలా సినిమాలు బాగానే వున్నా, కమర్షియల్‌గా మాత్రం ఆడడం లేదు. దాంతో ప్రస్తుతం కమర్షియల్ అంశాలున్న సినిమా కధల వైపు సుధీర్ చూస్తున్నారని టాక్.