Smart Phones : అతి తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్స్ తో సూపర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!!

Smart Phones : ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లకు బాగా బానిస అయ్యారు అని చెప్పవచ్చు.నేడు పుట్టిన పిల్లవాడు కూడా ఏడుపు ఆపాలి అంటే స్మార్ట్ ఫోన్ ని చూపిస్తే చాలు ఏడుపు ఆపేస్తున్నాడు అనే స్థాయికి చేరుకున్నారు ప్రజలు. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎంతోమంది స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతేకాదు డబ్బుకు సంబంధించిన ఎన్నో లావాదేవీలను కూడా మనం ఈ స్మార్ట్ మొబైల్ ను ఉపయోగించి వాడుతున్నాము. కేవలం డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మాత్రమే కాదు మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి కూడా స్మార్ట్ ఫోన్ అనేది చాలా అవసరం. ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది ఒక భాగమైపోయింది.

మరి ఇలాంటి అత్యవసరమైన ఫోన్ కొనుగోలు చేయాలి అంటే చాలామంది దగ్గర డబ్బులు సరిపోవడం లేదు. ముఖ్యంగా దిగువ తరగతి ప్రజల వద్ద పది వేల రూపాయల కంటే ఎక్కువగా పెట్టి మొబైల్ తీసుకోవడానికి స్తోమత కూడా లేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి వారి కోసమే కొన్ని సంస్థలు తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక అతి తక్కువ ధరకే సరికొత్త ఫీచర్లతో కలిగిన మొబైల్ కావాలి అని ఎదురు చూసే వారికి ఇప్పుడు సరికొత్త ఆఫర్ లు అందుబాటులోకి వచ్చాయని చెప్పవచ్చు. కేవలం ఐదు వేల రూపాయల లోపు ధరతో 4 G స్మార్ట్ ఫోన్ కొనవచ్చు. మరి ఎటువంటి బ్రాండెడ్ కంపెనీలు కేవలం అంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను ఆఫర్లు చేస్తున్నాయి. వాటి ఫీచర్ లు ఏంటి .. ఏ ఈ కామర్స్ సంస్థ ద్వారా కొనుగోలు చేయాలి..ఇలా అన్ని వివరాలను ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

Super smart phones with the best features at the lowest price
Super smart phones with the best features at the lowest price

1. షియోమీ రెడ్మీ 2 : భారత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న టెక్ సంస్థలలో షియోమీ కూడా ఒకటి. ఇక ఇంతటి బ్రాండెడ్ కలిగిన షియోమీ సరి కొత్తగా ఒక స్మార్ట్ ఫోన్ ను 4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో లభిస్తుంది. రెడ్మీ 2 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 410 చిప్ సెట్ తో వన్ జి బి రామ్ తో పాటు 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా మీరు పొందుతారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫోర్ జి తో రానుంది. ఇక 8 ఎంపీ బ్యాక్ కెమెరా తోపాటు 2 ఎంపి ఫ్రంట్ కెమెరా తో మీ స్మార్ట్ మొబైల్ మనకు లభించనుంది. ఇక వినియోగదారులు ఇందులో 2280 హెచ్ బ్యాటరీ ని కూడా పొందుతారు ఇక ప్రస్తుతం ఈ ఫోన్ ద్వారా రూ.4,990 .

2. సాంసంగ్ గెలాక్సీ M01 కోర్ : సాంసంగ్ గెలాక్సీ M01 కోర్ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే 5.3 అంగుళాల పొడవుతో పాటు PLS TFT LCD డిస్ప్లేతో లభిస్తుంది. వినియోగదారులు మీడియా టెక్ చిప్‌సెట్‌తో 1 జీబీ ర్యామ్‌ అలాగే 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ను కూడా పొందుతారు. ఈ 4G స్మార్ట్‌ఫోన్ 3000 mAh బ్యాటరీ ని కలిగి ఉంటుంది. దీని రియర్ 8 ఎంపీ కెమెరా, ఫ్రంట్ భాగంలో 2 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 4,999.

3.రిలయన్స్ జియోఫోన్ నెక్స్ట్ : ఈ స్మార్ట్ ఫోన్ లో డిస్ ప్లే 5.45 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్కమ్‌ స్నాప్ డ్రాగన్‌ 215 చిప్‌సెట్‌తో పాటు 2 జీబీ ర్యామ్‌ అలాగే 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో కూడా వస్తుంది. రూ.4,434కే ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తుంది. ఈ ఫోన్ 13 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వినియోగదారులు 3500 mAh బ్యాటరీని పొందుతారు.