ఓ తల్లి కామకోరికలకు, బలియైపోయిన భవిష్యత్ సూపర్ మోడల్ ‘మాయ’!

ఫిబ్రవరి 11 అర్ధరాత్రి లీసెస్టర్‌షైర్‌లోని A46 డ్యూయల్ క్యారేజ్‌వేపై కారు ప్రమాదంలో మరణించిన 21 ఏళ్ల సాకిబ్ హుస్సేన్‌ను చంపిన నేరానికిగాను మాయ అని పిలువబడే 23 ఏళ్ల మహేక్ బుఖారీ మరియు ఆమె 46 ఏళ్ల వయస్సుగల తల్లి అన్‌స్రీన్ బుఖారీతో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మీరు గత మూడు రోజులుగా వినే వుంటారు. పచ్చిగా చెప్పాలంటే ఓ తల్లి కామకోరికలకు, భవిష్యత్ లో మంచి మోడల్ గా ఎదగాలనుకున్న కూతురు బలైపోవడం ఈ కధలో చూడవచ్చు.

Advertisement

లండన్ టిక్ టాక్ స్టార్ మహేక్ బుఖారీ అలియాస్ మాయ పేరు మీరు ఎక్కడో ఒకచోట వినే వుంటారు. ఎక్కడ విన్నా వినకపోయినా, గత మూడురోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఆమె గురించిన కధనాలు మీరు వినే వుంటారు. మాయ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మరియు టిక్ టాక్ స్టార్. ఆమెకి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ వున్నారు. కెరీర్ దాదాపు మంచి పిక్స్ కి వెళుతున్నప్పుడు అనూహ్యంగా ఆమె జీవితాన్ని ఓ హత్య కేసు కుదిపేసింది. ఇంకేముంది కట్ చేస్తే తన తల్లి చేసిన ఘనకార్యానికి ఆమె కూడా జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది.

Advertisement

ఆమె తల్లి అన్‌స్రీన్ బుఖారీ గురించి ఒక్క వాక్యంలో చెప్పడం కష్టం. వీరిది లండన్లో సెటిలైన వున్నత కుటుంబం. పాకిస్థాన్ నుండి అన్‌స్రీన్ బుఖారీ భర్త తన కుటుంబాన్ని వ్యాపార నిమిత్తం లండన్ తీసుకొచ్చాడు. వీరికి ఒక కొడుకు, కూతురు సంతానం. ఆ కూతురిపేరే మహేక్ బుఖారీ అలియాస్ మాయ. వీరు ఏ ముహూర్తాన అక్కడికి వలసపోయారు గాని, అనతికాలంలోనే బాగా సెటిలైపోయారు. అయితే అంతా బాగానే ఉందిగానీ, మాయ తల్లికి వున్న సెక్స్ వీక్ నెస్ వారి కుటుంబాన్ని తలకిందులు చేసింది.

అన్‌స్రీన్ బుఖారీకి వయస్సులో వున్న కుర్రాళ్లంటే పిచ్చి. దాంతో తమదగ్గర పనిచేసే కుర్రాళ్లతో అక్రమసంబంధం నెరిపేది. ఈ విషయంలో తన భర్త ఎంత చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీ సర్కిల్ లోని ఓ యువకుడిని పట్టింది. అతగాడి పేరే సాకిబ్ హుస్సేన్‌. అతగాడి వయస్సు కేవలం 18 ఏళ్ళు మాత్రమే. తనకున్న చాకచక్యంతో ఆమె విజయవంతంగా అతగాడితో తరచూ శృంగారం నెరిపేది. అలా రెండేళ్లు గడిచాక ఆమెకి ఆ కుర్రాడిపైన ముఖం మొత్తింది. దాంతో వాడిని దూరం పెట్టింది. ఆ విషయం సాకిబ్ హుస్సేన్‌కి ఎంతమాత్రమూ నచ్చలేదు. వారి ప్రైవేట్ వీడియోలు తమ ఫ్యామిలీ సర్కిల్ లో షేర్ చేస్తానని బెదిరించాడు.

తలనొప్పిగా మారిన సాకిబ్ హుస్సేన్‌ని ఎలాగన్నా తప్పించాలని అదిరిపోయే పధకం వేసింది మాయ తల్లి. ఈ క్రమంలో కూతురు మాయ సలహా తీసుకుంది. అనుకున్నట్టుగానే వీరి వేసిన ప్లాన్లో భాగంగా సాకిబ్ హుస్సేన్‌ మరియు తన స్నేహితుడు రోడ్ ఆక్సిడెంట్లో మరణించారు. కట్ చేస్తే సాకిబ్ హుస్సేన్‌ను చంపిన నేరానికిగాను మాయ అని పిలువబడే 23 ఏళ్ల మహేక్ బుఖారీ మరియు ఆమె 46 ఏళ్ల వయస్సుగల తల్లి అన్‌స్రీన్ బుఖారీతో కలిసి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఒకమనిషికి వున్న మితిమీరిన కామం ఎంతటి ఘోరానికి పాల్పడిందో చూశారా?

Advertisement