Sun Salutation : జీవన స్థితి లో ప్రజలకు ప్రత్యక్ష దేవుళ్లు ఈ సూర్యచంద్రులు అని చెప్పవచ్చు. సాధారణంగా మనం ఈ సృష్టిలో ఉన్న ఏ దేవదూతలను చూడలేము కానీ వెలుగు చీకటి ల తారతమ్యం తో ప్రజలకు ఎప్పుడు సూర్యచంద్రులు దర్శనమిస్తూ వుంటారు. అందుకే మనం సూర్యచంద్రులను దేవుళ్ళుగా పూజిస్తూ.. కొన్ని ప్రదేశాలలో దేవాలయాలు కూడా నిర్మించడం జరిగింది. నిత్య పూజలను అందుకునే సూర్యుడు మనకు ఎన్నో రకాల ఆయురారోగ్యాలను కలిగిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే వైద్యులు మనిషి ఆరోగ్యం మెరుగు పడాలి అంటే తప్పకుండా సూర్యనమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు.
ఈ సూర్య నమస్కారాలు అనేవి ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల లోపు ఆరుబయట సూర్యుడిని చూస్తూ తగిన వ్యాయామాలు చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉదయం పూట సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు వల్ల మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి కారణంగా కొన్ని రకాల జబ్బులను దూరంగా ఉంచవచ్చు. ఇకపోతే సూర్యనమస్కారాలు చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది నిశ్వాస, ఉచ్వాసల కారణంగా శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా చక్కగా అందుతుంది.శరీరంలోని ప్రతి అవయవం చాలా చక్కగా పనిచేయడమే కాకుండా

బరువు తగ్గే వారికి మంచి ఆసనాలు ఈ సూర్య నమస్కారాలు అని చెప్పవచ్చు.. మనలో ఆత్మవిశ్వాసం తో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఊపిరితిత్తులతో పాటు మొత్తం శ్వాసనాళాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు సూర్యనమస్కారాల వల్ల మన ఆలోచనలలో స్పష్టత వస్తుంది. మంచి నిద్రతో పాటు ఉత్సాహంగా యవ్వనంగా ఉండడానికి కూడా ఈ సూర్య నమస్కారాలు పనిచేస్తాయి. ఇక వీటితో పాటు ఆహార పానీయాలు కూడా సేవిస్తూ ఉండాలి.. ముఖ్యంగా పోషకాలు కలిగిన ఆహారాలను రోజువారి డైట్ లో చేర్చుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సైతం సూచిస్తున్నారు.