Sudheer: సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నా.. కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ కి దూరమైపోయాడు. అయితే సుధీర్ అంటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన సుడిగాలి సుధీర్, మరోసారి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.. కానీ ఇప్పుడు సుధీర్ వెనుక జరుగుతున్న కుట్ర మాత్రం తెలుసుకోలేక పోతున్నాడు..
సుధీర్ జబర్దస్త్ ఎందుకు వదలాల్సి వచ్చింది అనే విషయాన్ని మల్లెమాలకు సైతం వివరించాడు. అయితే మల్లెమాల మేనేజ్మెంట్ మాత్రం, సుధీర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించడం అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సుధీర్ జబర్దస్త్ లోకి వస్తాను అని చెప్పినా, టీంలు ఫుల్ అయిపోయాయి అని, ఖాళీ లేదు అంటూనే, స్టార్ మా నుంచి వచ్చినా సద్దాం, యాదమ రాజును తీసుకోవడం సుధీర్ కు ఒక రకంగా అవమానమే. కాగా జబర్దస్త్ లోకి సుదీర్ రాకుండా అడ్డుకునేందుకు ఓ శక్తి వెనకనుండి గట్టిగా ప్రయత్నిస్తోందని.. అందుకే తనకన్నా జూనియర్ అయిన సద్దామ్ తీసుకొని, సుధీర్ ను వదిలి వేయడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని సుధీర్ అభిమానులు అనుకుంటున్నారు. సుధీర్ ను అపడం, అడ్డుకోవడం ఎవరి తరం కాదని, తను తన కష్టాన్ని నమ్ముకుని వచ్చాడని.. ఎప్పటికైనా ఇండస్ట్రీలో సుధీర్ కు ఒక మంచి పొజిషన్లో నిలబడటం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.