Real Friendship : స్నేహితుడిని భుజాలపై వేసుకుని హాస్పిటల్ కి.. పట్టించుకోని కాలేజ్ సిబ్బంది తీరు..

Real Friendship : రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్ధి సాత్విక్ బలవన్మరణం కు ఒత్తిడి కారణమని ఏసీపీ రమణ గౌడ్ తెలిపారు. నార్సింగి శ్రీ చైతన్య కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్ధి సాత్విక్ మంగళవారం నాడు రాత్రి తన ప్రాణం తనే తీసేసుకున్నాడు.. క్లాస్ రూమ్ లోనే సాత్విక్ బలవన్మరణం చేసుకున్నాడు. ఈ ఘటనపై పేరేంట్స్, విద్యార్ధి సంఘాలు కాలేజీ ముందు ఆందోళనకు దిగాయి. సాత్విక్ ఫ్రెండ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీడియాకు వెల్లడించారు..

ఈ ఘటనపై ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, వార్డెన్ పై కేసు నమోదు చేసినట్టుగా ఏసీపీ రమణగౌడ్ మీడియాకు చెప్పారు. సాత్విక్ బలవన్మరణం కి గల కారణాలపై తాము విచారణ చేస్తానని తెలిపారు. కాగా సాత్విక్ ఫ్రెండ్ మీడియాతో మాట్లాడుతూ.. కాలేజీలో తన ఫ్రెండ్ వేధింపులకు గురవుతున్నాడని తనని కాలేజీలో ఒకసారి కొట్టారని ఆయన అన్న మాటలకు సాత్విక్ బాధపడి ఒత్తిడికి లోనే ప్రాణాలు తీసుకున్నాడని తన స్నేహితుడు చెప్పాడు. ఆ రోజు రాత్రి భోజనం చేసి వచ్చిన తర్వాత బట్టలు ఆరేసే తీగ హాస్టల్ దగ్గర కనిపించలేదని దాంతో అనుమానం వచ్చి బయటకు వచ్చి చూస్తే సాత్విక్ ఎక్కడా కనిపించలేదని.. ఇక వార్డెన్ బయటకు పంపించమని ఎంతగా అడిగినా కూడా బయటకు పంపలేదని రాత్రికి కనిపించడం లేదని చెప్పినా కూడా వినలేదని తెలిపాడు ..

ఇక సీనియర్ వార్డెన్ అటుగా వెళుతుండగా కనీసం ఒక్కరినైనా పంపమని వేడుకోగా.. నన్ను బయటకు పంపించారని ఇక కాలేజ్ మొత్తం తిరిగి చూస్తే క్లాస్ రూమ్ లో ఊరి వేసుకొని సాత్విక్ కనిపించాడని తన ఫ్రెండ్ చెప్పాడు. తన ప్రాణాలు తీసుకోవడానికి క్లాస్ రూమ్ లో ఉరి వేసుకున్నప్పుడే తనని బయటకు తీసుకొని భుజాల మీద వేసుకొని వస్తున్నప్పుడు చేయి కదిలిందని .. ఆ తర్వాత తనలో ఎలాంటి కదలికలు లేదని తన స్నేహితుడు చెప్పాడు. అంతేకాకుండా కాలేజీలో నుంచి బయటకు వచ్చి కాస్త దూరం నడిచి ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్లామని కూడా చెప్పాడు. ఎంత లెగవరా అని లేపుతున్న కానీ లెగవలేదని కన్నీటి పర్యవంతమయ్యాడు తన స్నేహితుడు.

ఈ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్ , ఇతర లెక్చర్లు విద్యార్ధులను వేధింపులకు గురి చేస్తున్నారని సాత్విక్ పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గతంలో పలుమార్లు కాలేజీ యాజమాన్యంతో చర్చించేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదని సాత్విక్ తండ్రి రాజు ఆరోపిస్తున్నారు. సాత్విక్ ఇక లేడన్న సంగతి కూడా తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.