మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలతో పాటు టీడీపీ వర్గాలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అయితే ఈ రెండు పార్టీ వర్గాలు ఎదురైనప్పుడు హింసాత్మక వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే చాలాసార్లు వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. కాగా తాజాగా వైసీపీ శ్రేణులు నందమూరి బాలకృష్ణ వెళ్తున్న కారుపై రాళ్ల వర్షం కురిపించారని తెలుస్తోంది. ఈ దాడి పై మోహన్ బాబుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా తీవ్రంగా స్పందించారని సమాచారం.
బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతను సినిమాలలో కూడా హీరోగా నటిస్తూ అలరిస్తున్నాడు. అయితే అలాంటి ప్రముఖుడిపై రాళ్లదాడి చేయడం ఎంతవరకు సమంజసమని సామాన్య ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువత్తుతోంది. ముఖ్యంగా బాబాయ్‌ను ఎంతో ప్రేమగా చూసుకునే జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి దాడిని తాము అసలు సహించబోమని వార్నింగ్లు ఇస్తున్నాడు. మరోసారి తన బాబాయి మీద గాని తన ఫ్యామిలీ మీద గానీ ఎటువంటి దాడులు చేస్తే ఒక్కొక్కడిని ఊరికిచ్చి మరీ కొడతానని అతను ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ప్రస్తుతానికి బాలకృష్ణపై దాడి జరిగినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో కలిసి కెరీర్ 30వ సినిమా దేవర, ప్రశాంత్ నీల్‌తో కలిసి 31వ సినిమా, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నాడు. బాలకృష్ణ కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. భగవంత కేసరి అనే ఒక యాక్షన్ కామెడీ చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీ లీల ఇద్దరు హీరోయిన్లు నటించడం విశేషం. 109వ సినిమా కూడా బాలయ్య బాబు ప్లాన్ చేశాడు. ఈ నందమూరి అందగాడు సినిమాలు, రాజకీయాలు రెండింటిలో బిజీ అయి ఉన్నాడు. కానీ ఎవరిపై ఎలాంటి విమర్శలూ చేయడం లేదు. అతనిపై అన్యాయంగా దాడి చేయడం ఖండించదగినదిగా సినిమా ఇండస్ట్రీ వర్గాలు కూడా కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.