Hero : మేకప్ ఆర్టిస్ట్ మీద సెట్స్ లోనే చేయి వేసిన స్టార్ హీరో.. కొన్ని రోజులకే ఆమె ఏం చేసింది అంటే..

Hero :ఇటీవ‌లి కాలంలో మ‌హిళ‌ల‌పై అమానుష ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. సామాన్యులతో పాటు ప్ర‌ముఖులు సైతం దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు. తాజాగా క‌ర్ణాట‌క‌లోని ధార్వాడ్ జిల్లాలో ఉదంతం చోటు చేసుకుంది. క‌న్నడ స్టార్ హీరో మ‌నోహ‌ర్ పాయ్ ( పేరు మార్చ‌డం జ‌రిగింది) సెట్స్‌లో మేక‌ప్ ఆర్టిస్ట్ మీద చేయి వేశాడు. త‌న కోరిక తీర్చాలంటూ బ‌ల‌వంతం చేశాడు. అంతేకాదు ఆమెకు ముద్దులు కూడా పెట్టాడు. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించి తన స్నేహితులకు ఫోన్ చూసి చెప్పింది.

Hero : త‌ప్పుడు ప‌ని..

దాంతో మేక‌ప్ ఆర్టిస్ట్ స్నేహితులు సెట్స్‌లోకి అడుగు పెట్టి స్టార్ హీరోని చావ బాదారు. ఇక బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో ఆప్రాంతంలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని, మ‌నోహార్ పాయ్‌ని అరెస్టు చేశారు. అంత పెద్ద స్టార్ హీరో అయి ఉండి సెట్స్‌లో ఓ మేక‌ప్ ఆర్టిస్ట్‌తో ఇలా చేయ‌డ‌మేంట‌ని తోటి ఆర్టిస్ట్‌లు వాపోతున్నారు. అంతేకాదు అత‌నికి క‌ఠిన శిక్ష ప‌డేలా చూడాల‌ని కోరుతున్నారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

star hero misbehaves with makeup-artist
star hero misbehaves with makeup-artist

ఇటీవ‌ల మ‌హిళ‌లు ధైర్యంగా లైంగిక వేధింపుల‌ని ఎదుర్కొంటున్నారు. త‌మ‌ను ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష ప‌డేలా చూస్తున్నారు. అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉన్నా సినీ పరిశ్రమలోనే ఈ మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆఫర్లు కావాలంటే హీరోయిన్స్, లేడి ఆర్టిస్టులని తమతో బెడ్ షేర్ చేసుకోవాలని కొంతమంది అడిగేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో మార్పులు వ‌చ్చాయి. సినీ పరిశ్రమలో చాలా వరకు కాస్టింగ్ కౌచ్ అనేది కనుమరుగైంది. అప్పుడప్పుడు ఎక్కడో ఇలాంటి సంఘటన ఒక‌టి జరుగుతుంది. మీటూ ఉద్యమం వచ్చాక కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్న‌ చాలా మంది నటీమణులు, హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండ‌డంతో మ‌హిళ‌ల‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించేందుకు భ‌య‌ప‌డుతున్నారు.

Advertisement