#SSMB 29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆయన తన 29వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అని యావత్ సినీ ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురు చూపులకు తెరదించుతూ ఫెస్టివల్ సందర్భంగా మహేష్ రాజమౌళి మూవీకి సంబంధించి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి తన సినిమా లుక్స్ కోసం మహేష్ ని కొన్ని యాంగిల్స్ లో కవర్ చేస్తూ లుక్ టెస్ట్ కోసం తీసిన ఒక వీడియోలో.. సినిమా కాన్సెప్ట్ ను వివరించేలా ఉండబోతున్న ఈ గ్లింప్స్ ని ఉగాది రోజున అంటే మార్చి 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా సమాచారం అందుతుంది. ఉగాది రోజు రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మరీ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నారట. ఈ విషయం తెలిసి అభిమానులలో పూనకాలు ఫుల్ లోడింగ్ అని చెప్పవచ్చు.