Sri Reddy: శ్రీ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. శ్రీరెడ్డి ఒకప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలమైనప్పటికీ.. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటలు చేస్తూ నెటిజన్స్ కు మరింత దగ్గర అయింది శ్రీరెడ్డి.. నేడు భోగి సందర్భంగా తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోని విడుదల చేస్తూ భోగి శుభాకాంక్షలు తెలియజేసింది శ్రీ రెడ్డి..

భోగి అంటేనే రంగురంగుల రంగవల్లులు వాటిపైన పెట్టే గొబ్బెమ్మలు. శ్రీరెడ్డి సంక్రాంతి పండుగలో గొబ్బెమ్మ విశిష్టతను తెలుపుతూ ఆవు పేడను తీసుకొని గొబ్బెమ్మ ఎలా తయారు చేయాలో చేసి చూపించింది. ఎప్పుడు బోల్డ్ డైలాగ్స్ తో రెచ్చిపోయే శ్రీ రెడ్డి ఈరోజు గొబ్బెమ్మలు చేయడం కోసం ఆవు పేడ పట్టుకుంది శ్రీరెడ్డి నీకోసం పండగ రోజు పేడలో చేతులు పట్టాలా ఇదేం బాగోలేదు శ్రీ రెడ్డి అంటూ నేటిజన్స్ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. పండగ రోజు మమ్మల్ని ఆ పని చేయమనద్దు శ్రీ రెడ్డి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ రెడ్డికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.