Sri Reddy: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే శ్రీ రెడ్డి తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఓ రేంజ్ లో విరుచుకుపడింది.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసుకుని విమర్శించేవారిపై రణస్థలం సభలో పంచ్‌ల వర్షం కురిపించాడు హైపర్ ఆది.. ఇప్పుడు ఇదే టాపిక్ పై శ్రీ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ వేసింది..

డైపర్ ఆది జంబలకడ జారు మిఠాయి అనే టైటిల్ పెట్టి.. శ్రీ రెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో ఆది పై బూతుల పురాణం ఎత్తుకుంది.. ఆది నీ తిట్టడం కాదని ఆదికి గురువైన నాగబాబు నుంచి మొదలుకొని పవన్ కళ్యాణ్ ఆదిని కూడా చడమడ వాయించింది. అదికి అసలు సిగ్గు లేదని పవన్ కళ్యాణ్ పెద్ద ప్యాకేజీ అని వాడికి ఇచ్చిన ప్యాకేజీలో ఆదికి కూడా ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చి ఉంటారని.. అందుకే ఆది ఈ రేంజ్ లో మాట్లాడాడని.. మామూలుగా అమ్మాయిలు అంటేనే పడని అది బ్రాహ్మణ కులంలో ఎలా పుట్టాడో అర్థం కావడం లేదంటూ నోటికి వచ్చినట్లుగా వాయించేసింది శ్రీరెడ్డి. మొత్తానికి తన బోల్డ్ డైలాగ్స్ తో హైపర్ ఆదికి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలవలేదు నువ్వెలా గెలుస్తావో ఆ పార్టీ ఎక్కడ నిలబడుతుంది అంటూ దుమ్మెత్తి పోసింది శ్రీ రెడ్డి.