Sri Leela: మహేష్ బాబుతో సినిమా అనేది ఈతరం హీరోయిన్ల కల. అది కూడా అప్‌కమింగ్ హీరోయిన్స్ అయితే ఆ ఛాన్స్‌ని అస్సలు వదులుకోరు.. కానీ శ్రీ లీల ఆ ఛాన్సు ను వదులుకుంది.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కానీ ఇది నిజమైనంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు..

పెళ్లి సందD సినిమా తర్వాత ధమాకాతో కలిపి మొత్తం ఆరు సినిమాలకి శ్రీలీల సంతకం చేసింది. ఇందులో ధమాకా ఇప్పటికే విడుదలై హిట్ అయ్యింది. ఇక నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నటించబోతున్న శ్రీలీల, రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. నితిన్, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాలకీ శ్రీలీల సంతకం చేసింది. దాంతో SSMB28 షూటింగ్ వాయిదా కారణంగా శ్రీలీల ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి వచ్చిందట.. సో అందుకే మహేష్ బాబు సినిమా నుంచి శ్రీ లీల తప్పుకున్నట్లు టాక్.. ఇక శ్రీ లీల స్వయంగా ఫోన్ చేసి ఏమీ అనుకోకండి .. నేను మీతో నటించలేను.. ఇట్స్ మై బ్యాడ్ లక్ అని అనిందట. అందుకు మహేష్ కూల్ గా నవ్వేశారట.. టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న శ్రీ లీల ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినందుకే ఈ చిత్రం నుంచి తప్పుకుందని మరో టాక్ కూడా వినిపిస్తోంది.