Sreemukhi: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీముఖి.. ఇక క్రేజ్ పెరిగినట్టే..!

Sreemukhi.. బుల్లితెరకి గ్లామర్ టచ్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. యువతలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె ఇటీవల వరుస సినిమాలలో అవకాశాలు అందు కుంటోంది. ఇటీవలే చిరంజీవి భోలా శంకర్ సినిమాలో సందడి చేయనున్న శ్రీముఖి.. ఇప్పుడు మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్యమైన పాత్రకు ఎంపికైందని తెలుస్తోంది.

Sreemukhi |

ఇందులో బాలయ్య కూతురుగా శ్రీ లీలా నటిస్తుండగా ఆమెకు ఫ్రెండ్ క్యారెక్టర్ లో శ్రీముఖి నటించనుందని తెలుస్తోంది.. మొదటి నుంచి చివరి వరకు ఈ పాత్ర తెరపై కనిపిస్తుందని చెబుతున్నారు. దసరాకి ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గనుక సక్సెస్ అయితే ఇక యాంకర్ శ్రీముఖి కాస్త వెండితెరకే యాక్ట్రెస్ శ్రీముఖిగా పరిమితం అవుతుందనటంలో కూడా సందేహం లేదు.