Sree Mukhi: శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. తన అందం, అభినయంతో పాటు చలాకీ మాటలతో నవ్విస్తూ ప్రేక్షకులను టీవీకి కట్టిపడేస్తుంది. యాంకరింగ్ లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. శ్రీముఖి యాంకర్ గా చేస్తున్నా స్టార్ మా పరివార్ కి సంబంధించిన తాజాగా ప్రోమో విడుదలవుగా.. ఆ షో కి కార్తీకదీపం వంటలక్క డాక్టర్ బాబు వచ్చారు. అయితే శ్రీముఖి వాళ్ళతో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

పటాస్ షో లో యాంకర్ రవితో కలిసి ఎంటర్టైన్మెంట్ పంచిన శ్రీముఖి బుల్లితెరపై మోస్ట్ ఎనర్జిటిక్ యాంకర్ కొనసాగుతుంది. ఆ తర్వాత పలు షలల్లో కనిపించిన శ్రీముఖి.. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లడం.. ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందించి బిగ్ బాస్ రన్నర్ అప్ గా నిలిచి కోట్ల మంది అభిమానుల మనసు గెలుచుకుంది. షో ఏదైనా సరే శ్రీముఖి తన అల్లరి చేష్టలతో, వాక్చాతుర్యంతో షోను ఎంటర్టైనింగ్ గా మార్చేస్తుంది.. శ్రీ ముఖి ఇటీవల అందాల తార, డాన్స్ ఐకాన్, స్టార్ మా పరివారం, మిస్టర్ అండ్ మిసెస్, సారంగదరియా షోలకు యాంకరింగ్ చేస్తుంది..
స్టార్ మా పరివారం నెక్స్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు, వంటలు అక్క గెస్ట్ లుగా వచ్చారు. వంటలక్క వస్తూ వస్తూ.. నేను లేనిది చూసి లైన్ వేస్తున్నావా అంటూ డాక్టర్ బాబుని ఉద్దేశించి అంటూ ఇక స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తుంది. ఇంతలో శ్రీముఖి కలుగజేసుకొని నన్నయితే ఇలా హగ్ కూడా చేసుకున్నాడు అంటూ ఏకంగా వంటలక్క ముందే డాక్టర్ బాబును గట్టిగా హత్తుకుంటుంది.
ఇక డాక్టర్ బాబు కూడా శ్రీముఖిని గట్టిగా హాగ్ చేసుకుంటాడు. అయితే నువ్వు ఒప్పుకుంటే డాక్టర్ బాబును పెళ్లి చేసుకుంటా అంటూ శ్రీముఖి కొంటెగా అంటుంది.. నా డాక్టర్ బాబును ఎవరికి ఇవ్వను అంటూ వంటలక్క వెంటనే డాక్టర్ బాబుని తన వైపుకు లాక్కుంటుంది.. సరదా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ చివరిలో కార్తీకదీపం ముగుస్తుంది అంటూ కార్తిక్, దీప ఇద్దరు ఏడిపించారు. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.