Music Bot Evo : సౌండ్ బార్ ఏంటి..? అది కూడా రూ.1000 లోపు లభించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? నిజమే ఇప్పుడు మీకోసం ఒక కంపెనీ కేవలం ₹1000 లోపే సౌండ్ బార్ ను అందించడానికి సిద్ధమయింది.. ఇక అది ఏదో కాదు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న ఆడియో బ్రాండ్ pTron.. ప్రస్తుతం లేటెస్ట్ సౌండ్ బార్ ఆడియో సిస్టం Music bot Evo ను విడుదల చేసింది.. ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలు ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో షో లు కూడా పెరుగుతున్నాయి..ఇక ప్రజాదారణతో హోం థియేటర్ సౌండ్ సిస్టం కోసం పెరుగుతున్న డిమాండ్ కున్న ఈ లేటెస్ట్ సౌండ్ బార్ ను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
అది కూడా కేవలం 1000 రూపాయల కంటే తక్కువ ధరకే విడుదల చేయడం గమనార్హం. pTron Music bot Evo సౌండ్ బార్ సొగసైన డిజైన్ తో లేటెస్ట్ టెక్నాలజీతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఇక ఇందులో ఇన్బిల్ట్ బ్యాటరీ కూడా లభిస్తుంది. అలాగే 10 గంటల పాటు ప్లే బ్యాక్ ను అందిస్తుందని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉండే కనెక్టివిటీ విషయానికి వస్తే హెచ్ డి టీవీలు , ల్యాప్ టాప్ లు, టాబ్లెట్ పీస్ మొదలైన వాటికి సరిగ్గా కనెక్ట్ చేయడానికి సరిపోతుందని చెప్పవచ్చు. ఇక ఈ సౌండ్ బార్ కేవలం 38.7cm పొడవు 6.5Cm లోతు అలాగే 6.5 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది.
గుండ్రటి అంచులతో స్థూపాకార డిజైన్ ను కలిగి ఉంటుంది ఈ సౌండ్ బార్. ఇక అంతే కాదు 10 W స్పీకర్లు అలాగే 52 ఎంఎం డ్రైవ్ తో ఉంటుంది. ఇక ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ సౌండ్ బార్ లో ఉన్న బ్లూటూత్ 5.0 ద్వారా వైర్లెస్ గా సులభంగా మీరు మీ టీవీ, లాప్టాప్ , టాబ్లెట్ ఇలా దేనికైనా కనెక్ట్ చేయవచ్చు. మరింత సౌండ్ ను పొందాలనుకుంటే వైర్లెస్ స్టీరియో ఫైరింగ్ ఫంక్షన్ ద్వారా రెండు Music bot Evo సౌండ్ బార్ లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక అంతేకాదు 3.5 mm AUX ఇన్పుట్, USB డ్రైవ్, TF కార్డు లేదా బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ సౌండ్ బార్ ను మీరు ఫ్లిప్ కార్ట్ నుండి రూ.999 కే సొంతం చేసుకోవచ్చు.