Sony XR-85X95K : సోనీ నుంచి అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ టీవీ.. ధర తెలిస్తే షాక్..!!

Sony XR-85X95K : తాజాగా భారత మార్కెట్లోకి ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి సోనీ తమ కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ టీవీ ని ప్రవేశపెట్టింది.. Sony XR-85X95K మినీ ఎల్ఈడి పేరుపైన ఈ టీవీని విడుదల చేయబోతోంది. ఇకపోతే 95 K పిక్చర్ క్వాలిటీ రేంజ్ లో స్మార్ట్ టీవీ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ 85 అంగుళాల భారీ స్క్రీన్తో.. కాగ్నిటివ్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇకపోతే అద్భుతమైన ఫీచర్స్ తో కూడిన ఈ స్మార్ట్ టీవీ ధర మాత్రం అక్షరాల రూ.9 లక్షల.. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ పై ఆఫర్ కూడా నడుస్తోంది.

ఆఫర్ కింద రూ.7 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని ఎక్కువగా సోనీ సెంటర్స్ అలాగే ఈ కామర్స్ స్టోర్స్ లు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. డాల్బీ విజన్ సపోర్టుతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ని కూడా అందిస్తుంది. అధునాతన టెక్నాలజీ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ను అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కంట్రోల్ చేయవచ్చు. ఇక అంతేకాదు ఆండ్రాయిడ్ టీవీ సాఫ్ట్వేర్ పై ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. గూగుల్ టీవీ యూజర్స్ ఇంటర్ ఫేస్ ను కూడా ఇందులో ఉపయోగించుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ , ఎల్ఈడి బ్యాక్ లైట్ వంటివి కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 100 మెగాపిక్సల్ కెమెరా సెన్సార్ ను ఈ స్మార్ట్ టీవీలో రూపొందించినట్లు సమాచారం.

Sony XR-85X95K a smart TV with amazing features
Sony XR-85X95K a smart TV with amazing features

ఇక దీన్ని బట్టి చూస్తే అద్భుతమైన క్వాలిటీ కలిగిన వీడియోను మీరు వీక్షించవచ్చు. ముఖ్యంగా ఎవరికైనా మీరు వీడియో కాల్ చేయదలచుకుంటే ఈ స్మార్ట్ టీవీ ద్వారా వీడియో కాల్ మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ టీవీలో ఆపిల్ యూజర్స్ కి సంబంధించి ఎలాంటి యాప్ లనైనా సపోర్ట్ చేస్తుంది . 60 W అద్భుతమైన సౌండ్ అవుట్ పుట్ ను ఈటీవీ అందిస్తుందని చెప్పవచ్చు . ముఖ్యంగా ఈ టీవీ మీ ఇంట్లో ఉన్నట్లయితే ఒక గొప్ప థియేటర్ ఫీలింగ్ కలుగుతుంది అని కస్టమర్లు కూడా చెబుతున్నారు అయితే సామాన్యుడికి అందనంత దూరంగా ఉన్నప్పటికీ ఈ స్మార్ట్ టీవీ మాత్రం ఇంటికి ఆకర్షణగా నిలుస్తోంది.