Categories: News

జగన్ విలువ తెలిసిన సోనియా… ఆఖరికి కాళ్లబేరానికి?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతోంది అనే ప్రచారం తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతోంది. ఆ కార్యక్రమం ఏకంగా ఇడుపుల పాయలోనే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తుండడం ఇపుడు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయం నిజమో కాదో తెలియదు కానీ నిజంగానే ఇలాంటి పరిణామం జరిగితే మాత్రం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతుందని అనుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదు ఇదంతా జగన్ వ్యూహం అనేవారూ లేకపోలేదు.

అవును, జులై 8న వైఎస్ జ‌యంతి సంద‌ర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు క‌డ‌పజిల్లాలోని ఇడుపుల‌పాయ‌కు వచ్చి అక్క‌డ వైఎస్ స‌మాధి వ‌ద్ద నివాళులు ఆర్పించ‌నున్నార‌ని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదేగాని జ‌రిగితే వైఎస్ కుటుంబం మ‌ర‌లా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడం ఖాయం. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కొంత‌మేర బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ, ఏపీలో మాత్రం ఆ పార్టీ పట్టు పూర్తిగా సడలింది. ఒకప్పుడు కాంగ్రెస్ అనుచరులంటే ఇపుడు పూర్తిగా జగన్ బాటపట్టారు అనడం నిర్వివాదాంశం. ఈ విషయం పూర్తిగా అర్ధమైన సోనియా జగన్ ని ఎలాగన్నా ఆకర్శించుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

దానివలన సోనియాకి ఏపీలో ఒరిగిందేమి లేదుగాని, తెలంగాణాలో మరలా ఏదోలా జెండాను పాతేయాలని చూస్తోంది. జగన్ కాస్త సందిస్తే ఏపీలో కూడా అడుగుపెట్టకమానదు… అది భవిష్యత్ మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు. వైఎస్ కుటుంబం ఆ పార్టీతో క‌లిస్తే కాంగ్రెస్‌కు మ‌ళ్లి పున‌ర్వైభ‌వం సాధ్య‌మౌతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇపుడు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. సొంతంగా పార్టీ నడపడం కన్నా జాతీయ పార్టీలో విలీనం చేయడం మంచిదని అనుకున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు.

ఇకపోతే వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో నాటి ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీతో మంచి స‌త్సంబంధాలు కొనసాగేవి. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు వైఎస్ఆర్ కీల‌క పాత్ర‌ను పోషించారనే విషయం అందరికీ తెలిసినదే. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం చాలా ప్రయత్నాలే చేసేవారు. ఆ సత్సంబాల వల్లనే షర్మిల పార్టీని విలీనం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే.. ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసినదే.

వైఎస్.. తన జీవితాంతం కాంగ్రెస్ నే అంటి పెట్టుకుని ఉన్నారనే విషయం కూడా తెలిసిందే. కాంగ్రెస్ వల్లే ఆయనకు అత్యున్నత పదవులు, గౌరవం లభించాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత.. సోనియాపైనే జగన్ కుటుంబం దారుణ నిందలు మోపింది . వైఎస్ మరణం వెనుక సోనియా హస్తం ఉందని కూడా ఆరోపించిన సంగతి విదితమే. ఈ క్రమంలో జగన్ సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో నిర్వీర్యం చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచే అదీ కూడా వైఎస్ వారసుల్లో ఒకరు కాంగ్రెస్ చేరడం చిన్న విషయం కాదని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు బ్యాంక్‌ను దగ్గరకు తీసుకోవడానికి ఇవి ఇవి ఉపయోగపడాయని అనుకుంటున్నారు నిపుణులు. విషయం ఏదైనప్పటికీ జగన్ వ్యూహం తెలిసిన సోనియా ఇక్కడ రాజకీయంగా ఎదగడానికి జగన్ నామస్మరణ చేయక తప్పదని కొందరు భావిస్తున్నారు.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.