Sonia Gandhi: రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న సోనియా గాంధీ..!

Sonia Gandhi.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా ప్రకటించారు.. సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జూడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిస్తుండడంపై ఆమె సంతృప్తిగా ఉందని తెలిపారు. చత్తీస్గడ్ రాజధాని రాయపూర్ సమీపంలోని నయా రాయపూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలలో రెండో రోజైనా శనివారం ఆమె ప్రసంగించారు. 25 యేళ్ళ క్రితం పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి.. ఆమె సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ముందుగా ఒక వీడియోను ప్రదర్శించారు.

Sonia Gandhi Announces Retirement

ఆ వీడియో చూసిన తర్వాత తాను ఇప్పుడు ఎంత వృద్ధురాలు అయిందో కూడా ఆ వీడియో చాటి చెబుతోందని స్పష్టం చేశారు. పార్టీ పగ్గాలను తొలిసారిగా చేపట్టే గౌరవం.. 1998లో నాకు దక్కింది. గత పాతికేళ్లలో మన పార్టీ ఎంతో ఘనవిజయాన్ని, తీరని నిరాశ ను చూసింది. కీలక దశలో జరుగుతున్న భారత జూడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిస్తుండడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది .నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనేతృత్వంలో పనిచేసేందుకు యువ నేతలంతా ముందుకు రావాలి అంటూ సోనియా భావం వ్యక్తం చేశారు ఇకపోతే ఆమె రాజకీయాలకు స్వస్తి పలుకుతుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.