Smart Phones : సెప్టెంబర్ నెలలో సినిమాలకు మాత్రమే కాదు స్మార్ట్ ఫోన్లకి కూడా మంచి సమయమని చెప్పవచ్చు. ఇక ఈ నెలలో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి మరి ఆ స్మార్ట్ ఫోన్లో ధరలు, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, మోడల్ ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
మోటో ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ : ఈ స్మార్ట్ ఫోన్ 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 108 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా తో మొత్తం నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.144 Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి ఓఎల్ఈడి డిస్ప్లేను అందిస్తున్నారు.4, 400 ఎం ఏ హెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
షావోమీ 12 T సీరీస్ : ఈ స్మార్ట్ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల 2k AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.. లైకా కెమెరా సెట్ అప్ తో స్నాప్ డ్రాగన్ 8 + Gen 1 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
ఐఫోన్ 14 సీరీస్ : సెప్టెంబర్ 7వ తేదీన ఆపిల్ కంపెనీ నుంచి విడుదలవుతున్న ఐఫోన్ 14 సిరీస్ మొత్తం నాలుగు మోడల్స్ లో విడుదల కానుంది. వీటితోపాటు మూడు యాపిల్ కంపెనీ నుంచి ఐపాడ్ మోడల్స్ కూడా విడుదల కానున్నాయి.
Asus Rog phone 6 అల్టిమేట్ ఎడిషన్ : 6.78 అంగుళాల ఆములేటివ్ డిస్ప్లే తో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరాతోపాటు 12 మెగాపిక్సల్ కెమెరాని సెల్ఫీ కోసం అందిస్తున్నారు. 6000 ఏంఏహెచ్ బ్యాటరీతో, 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ అలాగే, 12GB ర్యామ్ + 256 GB వేరియంట్లలో లభించనుంది.
ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్లన్నీ కూడా బడ్జెట్ ధరలోని లభించడంతోపాటు మరిన్ని ఫీచర్లతో స్మార్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుండడం గమనార్హం. ఇప్పటికే ఎవరైనా స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ సెప్టెంబర్ నెల అందుకు మంచి సమయమని చెప్పవచ్చు. ఇక ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఇష్టమైన మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఎంపిక చేసుకొని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలలో తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.