Smart TVs : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు తమ ఇంటిని.. స్మార్ట్ టీవీ తో అందంగా తీర్చిదిద్దుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక స్మార్ట్ టీవీ కొనాలి అనుకుంటే చాలా ఖరీదుతో కూడుకున్న పని. ఇక బెస్ట్ క్వాలిటీ తో అత్యధిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలి అంటే మరింత ధర వెచ్చించాల్సి ఉంటుంది. ఇకపోతే స్మార్ట్ ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నావారికి ఇప్పుడు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఇక రూ.10 వేల లోపు లభించే ఆ స్మార్ట్ టీవీల గురించి , ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.
Thomson Alpha smart TV : ఈ స్మార్ట్ టీవీ ద్వారా మార్కెట్లో రూ.9,999 మాత్రమే. ఈటీవీ కూడా మీరు ఈ కామర్స్ సైట్ అయినటువంటి ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే 32 ఇంచులాల హెచ్డి క్వాలిటీ తో 1366×768 పిక్సెల్స్ రెజల్యూషన్ తో ఎల్ఈడి డిస్ప్లేను ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంటుంది. 400 నిట్స్ పీక్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇక బ్రెజిల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. ఈటీవీలో 4GB ర్యామ్, 512 GB స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. ఇక అమ్లాజికల్ ప్రాసెసర్ తో పాటు Linux ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. 30W సౌండ్ అవుట్ ఫుట్ ఇచ్చే స్పీకర్లు ఈటీవీలో ఉంటాయి. అంతేకాదు అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, జి ఫైవ్ తో పాటు మరికొన్ని ఓటిటీ యాప్ లలో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. ఇక వైఫై, బ్లూటూత్, 3HDMI స్లాట్స్ అలాగే రెండు యూఎస్బీ పోర్టులు , ఈథర్నెట్, హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Infinix 32Y1 smart TV : ఈ స్మార్ట్ టీవీ ధర మార్కెట్లో రూ.8,999 మాత్రమే. ఇక ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ లో ఈ టీవీని కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. 32 ఇంచుల హెచ్డి రెడీ ఎల్ఈడి డిస్ప్లేను కలిగి ఉంటుంది.250 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HGL ఫార్మేట్ కు సపోర్ట్ చేస్తుంది.512 MB ర్యామ్,4GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. Linux ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియోకు 20W సౌండ్ అవుట్ పుట్ ఇచ్చే స్పీకర్లను కలిగి ఉంటుంది. అంతేకాదు అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, సోనీ లివ్, జి ఫైవ్ లాంటి మరికొన్ని ప్రీ లోడెడ్ యాప్స్ అందుబాటులో ఉంటాయి.ఇక వైఫై, బ్లూటూత్, 3HDMI స్లాట్స్ అలాగే రెండు యూఎస్బీ పోర్టులు , ఈథర్నెట్, హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.