Smart TVs : ప్రస్తుతం ఎన్నో రకాల టెక్ సంస్థలు కేవలం స్మార్ట్ ఫోన్ లను మాత్రమే కాదు స్మార్ట్ టీవీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్మార్ట్ టీవీలు అత్యాధునిక ఫీచర్లతో, స్పెసిఫికేషనులతో కూడి ఉండడమే కాకుండా మన ఇంటిని థియేటర్ లా మార్చేస్తున్నాయి. అందుకే వీటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ సామాన్యుడు కూడా ఇలాంటి స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలి అంటే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రెడ్మి తాజాగా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ , టీవీలను అందించడానికి సిద్ధమయ్యింది. అది కూడా 12000 రూపాయల వరకు తగ్గింపు తో ఈ స్మార్ట్ టీవీలను మీరు సొంతం చేసుకోవచ్చు.
ఇక రెడ్మి అందిస్తున్న 32 ఇంచులు అలాగే 43 ఇంచులు రెండు స్మార్ట్ టీవీ ల పై మీకు రూ.12000 క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది. మరి ఈ స్మార్ట్ టీవీ ల గురించి ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం.. Xiaomi Smart TV 5A : 32 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మీకు ఈ కామర్స్ దిగజమైన ఫ్లిప్కార్ట్ లో 12000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు ఒకవేళ మీరు కండిషన్లో ఉన్న మీ పాత టీవీ ని ఎక్స్చేంజ్ చేసుకుంటే 11వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో ఈ టీవీ దొర రూ.24,999 కాగా ప్రస్తుతం రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు.
అంతేకాదు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 1000 రూపాయలు తక్షణ డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాదు ఈ స్మార్ట్ టీవీ నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ,ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్ లకు సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఓ ఎస్ పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ 1366 X768 పిక్సెల్ రిజల్యూషన్ తో 20 W సౌండ్ అవుట్ ఫుట్ ని కూడా అందిస్తుంది. ఇందులోనే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ కూడా మీకు 12 వేల రూపాయల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్లు పరిమితి ఉన్నంతవరకే ఆఫర్ ధరలో మీకు లభించనున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేసి మరింత డబ్బు ఆదా చేసుకోండి.