Smart TVs : ఈమధ్య కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని పలు రకాల కంపెనీలు తాజాగా తమ కంపెనీల నుంచి అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేశాయి. అద్భుతమైన ఫీచర్లతో రావడమే కాకుండా 60% డిస్కౌంట్ తో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి. మరి ఈ స్మార్ట్ టీవీల ధరలు, ఫీచర్స్ కూడా ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..
Motorola ZX 2 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ : ఈ టీవీ మీకు 32 అంగుళాల హెచ్డి రెడీ ఎల్ఈడి డిస్ప్లే తో లభిస్తుంది.1366X768 పిక్సెల్స్ రెజల్యూషన్ తో ఈ స్మార్ట్ టీవీ లభించడమే కాకుండా 40 W అండ్ అవుట్ ఫుట్ ని కూడా అందిస్తుంది . 60 HZ రిఫ్రెష్ రేటుతో ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లెక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి పలు ఓటిటి యాప్లకు మద్దతు ఇస్తుంది . అంతేకాదు గూగుల్ అసిస్టెంట్ , క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ పై మీకు 56% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ లో కంపెనీ అసలు ధర రూ.29,999 గా ఉండగా, అదే ఫ్లిప్ కార్ట్ లో మీకు 56% డిస్కౌంట్ తో కేవలం రూ.12,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు బ్యాంక్ ఆఫర్ కింద అదనంగా వెయ్యి రూపాయలు పొందే అవకాశం ఉంటుంది .
InnoQ Frameless 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ : 32 అంగుళాలు కలిగిన ఈటీవీ 1366 X768 పిక్సెల్స్ రెజల్యూషన్ తో వస్తుంది. ఇక 20W సౌండ్ అవుట్ పుట్ ను అందించి ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ బేస్డ్ పైన పని చేస్తుంది .60 HZ రిఫ్రిజిరేటర్ తో పనిచేసే ఈటీవీ మీకు ప్రైమ్ వీడియో , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , నెట్ ఫ్లెక్స్, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్ లకు మద్దతు పలుకుతుంది. ఇక మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ ధర రూ.27,990 కాగా ఫ్లిప్ కార్ట్ లో 68 శాతం డిస్కౌంట్ తో రూ.8,690 కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు అదనంగా బ్యాంక్ ఆఫర్ లో మీరు వెయ్యి రూపాయలు అదనపు డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది.