Smart TVs : ఈ మధ్యకాలంలో చాలామంది సినిమాలు చూడడానికి థియేటర్లకు వెళ్లడం మానేసారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక స్మార్ట్ టీవీ మీ ఇంట్లో ఉంటే చాలు అనేక ఓటిటి ప్లాట్ఫామ్స్ ద్వారా కొత్త కొత్త సినిమాలను ఇంట్లో ఉంటూనే కుటుంబ సభ్యులతో కలిసి చూడవచ్చు. ఇక ఎన్నో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ను తీసుకొస్తున్న స్మార్ట్ టీవీలు ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ స్మార్ట్ టీవీలు మీకు బెస్ట్ క్వాలిటీ స్క్రీన్ ను కలిగి ఉన్నాయి. ఇక 32 ఇంచుల పరిమాణంలో లభిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలు మీ ఇంటికి మంచి రూపాన్ని అందించడమే కాకుండా తక్కువ బడ్జెట్లో అందుబాటులోకి వచ్చాయి. మరి వాటి గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
Acer 32 ఇంచెస్ సీరీస్ హెచ్డి రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. ఈ స్మార్ట్ టీవీ 32 ఇంచుల పరిమాణంలో లభిస్తుంది. హెచ్డి రెడీ డిస్ప్లే తో లభించే ఈ స్మార్ట్ టీవీ ని అమెజాన్ లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్నో ఫీచర్లతో, కనెక్టివిటీ ఆప్షన్లతో ఈ స్మార్ట్ టీవీ మీకు అందుబాటులో ఉండడం గమనార్హం.1.5 GB ర్యామ్ తో పాటు 24W డాల్బీ ఆడియోను అందిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా కనెక్ట్ చేయబడుతుంది.

కార్బన్ 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ ఎల్ఈడి టీవీ.. ఈ స్మార్ట్ టీవీ మీకు 32 ఇంచుల హెచ్డి రెడీ ఎల్ఈడి డిస్ప్లే తో అందుబాటులోకి లభిస్తుంది. 1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్ తో లభిస్తుంది. 60 Hz రీఫ్రెష్ రేట్ తో పాటూ 2 USB పోర్ట్స్ కలిగి ఉంటుంది. 20 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. థియేటర్ అనుభవాన్ని కలిగిస్తుంది ఈ స్మార్ట్ టీవీ.. ముఖ్యంగా సౌండ్ బేస్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.
వన్ ప్లస్ 32 ఇంచెస్ Y సిరీస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ఈటీవీ మీకు 25% తగ్గింపుతో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో సొంతం చేసుకోవచ్చు. కనెక్టివిటీ కోసం రెండు హెచ్డిఎంఐ పోర్టులను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు సెటప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్స్, గేమింగ్ కన్సల్ వంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక రెండు యుఎస్బి పోర్టులను కూడా కలిగి ఉంటుంది. ఒక సంవత్సరం వారంటీతో లభిస్తుంది.