Samsung : ప్రముఖ టెక్ దిగ్గజం సాంసంగ్ తాజాగా ఆకట్టుకునే ఫీచర్స్ తో మరింత టెక్నాలజీ తో స్మార్ట్ టీవీ ని విడుదల చేసింది. ఇక ఈ స్మార్ట్ టీవీ మోడల్ విషయానికి వస్తే.. సాంసంగ్ క్రిస్టల్ 4k నియో సిరీస్ 43 ఇంచెస్ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ టైజెన్ టీవీ.. ఇక ఈ స్మార్ట్ టీవీ మార్కెట్ ధర రూ.47,900.. కానీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నుంచి మీరు కొనుగోలు చేస్తే 29% డిస్కౌంట్తో రూ.33,900 కే కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద కేవలం రూ.23,791 కే సొంతం చేసుకోవచ్చు. మరి ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.. హెచ్డిఎఫీచర్స్ఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఇక ఈ స్మార్ట్ టీవీ సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే.. నెట్ ఫ్లెక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ఓ టీ టీ యాప్ లను సపోర్ట్ చేస్తుంది. 3840 x 2160 పిక్సెల్ రెజల్యూషన్ తో అల్ట్రా హెచ్డి 4k క్రిస్టల్ తో ఈ స్మార్ట్ టీవీ వస్తుంది. 20 W సౌండ్ అవుట్ పుట్ ను అందివ్వడమే కాకుండా 50 Hz రిఫ్రెష్ రేటును కూడా కలిగి ఉంటుంది. టైజన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇక కస్టమర్ మెచ్చిన ఈ స్మార్ట్ టీవీ ఏకంగా కస్టమర్ నుంచి 4.4 స్టార్ రేటింగ్ను కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు వైఫై కనెక్టివిటీ కూడా చాలా వేగంగా అవుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా 10/10 మార్కులు ఇవ్వచ్చు అని కస్టమర్లు సైతం చెబుతున్నారు.
ఇక 3 హెచ్డిఎంఐ స్లాట్స్, 1 యూఎస్బీ పోర్టును కూడా కలిగి ఉంటుంది. రెండు స్పీకర్స్ తో 20 W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది. ముఖ్యంగా సౌండ్ మోడ్ లో ఫిలిం మోడ్, ఫిల్మ్ మేకర్ మోడ్, నేచురల్ మోడ్, ఆటో గేమ్ మోడ్ వంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి.8GB మెమొరీ స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంది. మొత్తానికైతే ఈ స్మార్ట్ టీవీ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.