Nokia Smart TV : నోకియా నుంచి అదిరిపోయే ఫీచర్ తో స్మార్ట్ టీవీ విడుదల.. ఆకర్షించే ధరలు..!!

Nokia Smart TV : నోకియా టెక్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మొట్టమొదటి టెక్ బ్రాండ్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ పలు రకాల ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కీప్యాడ్ మొబైల్స్ ని మొదలుకొని ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ల వరకు అన్నింటిని తన సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసి తమ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పదిలం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే 5G స్మార్ట్ ఫోన్ ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది . ఇదిలా ఉండగా ప్రస్తుతం నోకియా నుంచి పలు రకాల వేరియంట్స్ లో ఆకట్టుకునే ధరలలో స్మార్ట్ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం నోకియా తీసుకొచ్చిన నోకియా 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో ఏకంగా 34 శాతం డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది.

Advertisement

నిజానికి ఈ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ రూ.29,000.. ఇక ఈ 40 ఇంచుల స్మార్ట్ టీవీ ని మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు. అంతే కాదు ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే రూ . 1500 తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక ఇతర ఫీచర్స్ .. 1920 x 1080 పిక్సెల్ రెజల్యూషన్ తో ఫుల్ హెచ్డి డిస్ప్లేను అందిస్తుంది. 20 W సౌండ్ అవుట్ పుట్ ను కలిగి ఉండడమే కాకుండా 60 Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ ద్వారా మీరు ఐ ప్రొటెక్ట్ కలర్స్ ను కూడా పొందవచ్చు. ఇందులో లో, మీడియం, హై , ఆఫ్ వంటి లైట్ కంట్రోల్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ ని మీరు వీక్షించేటప్పుడు కంటికి ఎటువంటి ఆపద కలగకుండా అద్భుతమైన లో బ్లూ లైట్ ను కూడా అమర్చారు.

Advertisement
Smart TV release with amazing features from Nokia..attractive prices..!!
Smart TV release with amazing features from Nokia..attractive prices..!!

ఇక ఇందులో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ అమర్చబడ్డాయి. అంతేకాదు ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4 /5GHS వైఫై టైపును కలిగి ఉంటుంది. 3 హెచ్డిఎంఐ స్లాట్, రెండు యుఎస్బి స్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక మీడియా టెక్ డైమన్ సిటీతో, 180 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ ని కూడా కలిగి ఉంటుంది. ఇక ర్యామ్ కెపాసిటీ 1 జిబి, స్టోరేజ్ మెమొరీ 8GB గా అందించడం జరిగింది.

Advertisement