Realme Smart TV : రియల్ మీ నుంచి రూ.4,499 కే .. అద్భుతమైన ఫీచర్స్ తో.. స్మార్ట్ టీవీ లాంఛ్..!!

Realme Smart TV : రియల్ మీ సంస్థ తాజాగా అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ స్మార్ట్ టీవీ తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే రియల్ మీ నుంచి విడుదలైన స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్ , రియల్ మీ స్మార్ట్ వాచ్ ఇలా అన్నీ కూడా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ నేపథ్యంలోని రియల్ మీ నుంచి స్మార్ట్ టీవీ కూడా విడుదలై విశేష ఆదరణ పొందడం గమనార్హం. ఇకపోతే రియల్ మీ సంస్థ తాజాగా లాంచ్ చేసిన స్మార్ట్ టీవీ గురించి మోడల్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ , ధర ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Advertisement

రియల్ మీ 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ..1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్ తో పాటు 60 Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది.24 W సౌండ్ అవుట్ పుట్ ను అందించే ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ ను కూడా ఇమిడి ఉంది. ఇక ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేసే యాప్స్ విషయానికి వస్తే.. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి పలు ఓటీటీ యాప్ లకు మద్దతు పలుకుతుంది. ఇకపోతే ఈ స్మార్ట్ టీవీ ధర రూ.17,999 మార్కెట్ ప్రైస్ కాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ద్వారా 13% డిస్కౌంట్తో రూ.15,499కి సొంతం చేసుకోవచ్చు.

Advertisement
Smart TV launch with amazing features for Rs.4,499 from RealMe
Smart TV launch with amazing features for Rs.4,499 from RealMe

ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ గనుక వర్తిస్తే సుమారుగా ఈ స్మార్ట్ టీవీ పై రూ.11,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తే ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 4,499కి సొంతం చేసుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. హెచ్డిఎంఐ 3 స్లాట్స్, యూఎస్బి 2 స్లాట్స్ , వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు 178 వ్యూ యింగ్ యాంగిల్ ని కూడా కలిగి ఉండడం వల్ల ఎక్కడి నుంచైనా సరే టీవీని వీక్షించవచ్చు. ఇక మీడియాటెక్ క్వాడ్ కోర్ 683 ప్రాసెసర్ పై పనిచేసే ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్, 8GB స్టోరేజ్ మెమరీ ని కలిగి ఉంటుంది.

Advertisement