Smart TV : ఈ మధ్యకాలంలో స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచులను క్యాష్ చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా 25% డిస్కౌంట్ తో ఒక అద్భుతమైన ఫీచర్ కలిగిన ఏసర్ నుంచి స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయింది. మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..
ఏసర్ ఐ సిరీస్ 43 అంగుళాల అల్ట్రా హెచ్డీ 4k ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మనకు నాలుగు వేరియంట్స్ లో లభిస్తోంది . ముఖ్యంగా 32, 43, 50, 55 అంగుళాల వేరియంట్ తో మీకు నచ్చిన స్మార్ట్ టీవీ ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు. 60 Hz రీఫ్రెష్ రేట్ తో 3840 X2160 పిక్సెల్ రెజల్యూషన్ తో 4K అల్ట్రా HD తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. ఇక ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేసే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్ క్రోమ్ కాస్ట్ ఇన్ బుల్ట్ కూడా చేసి ఉండడం గమనార్హం. ఇక 30 W సౌండ్ అవుట్ ఫుట్ తో లభించే ఈ స్మార్ట్ టీవీ మీకు అన్ని విధాల మంచి క్వాలిటీని అందిస్తుందని చెప్పవచ్చు.
సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లెక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , యూట్యూబ్ వంటి ఓటిటి యాప్స్ కు మద్దతు పలుకుతుంది. అంతేకాదు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని కూడా ఈ స్మార్ట్ టీవీ అందిస్తుంది అని చెప్పవచ్చు. ఇక గూగుల్ ప్లే ద్వారా మీరు 5000 యాప్స్ ను యాక్సెస్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మల్టీ పోర్ట్ కనెక్టివిటీని కూడా అందించడం గమనార్హం. డ్యూయల్ బ్యాండ్ వైఫై 5GHs/ 2.4 GHs, 2 -Way బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఓ వంటి కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక USB 3.0 , హెచ్డిఎంఐ 2.0 3 స్లాట్స్, హెడ్ ఫోన్ కి ఒక జాక్, ఏవీ కోసం మరొక జాక్, వన్ ఏ బి సి కనెక్షన్ ఇలా అన్ని కనెక్టివిటీ ఆప్షన్లను కూడా అందించడం జరిగింది.