Smart TV : త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలా వరకు ఎన్నో వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే టీవీలు , రిఫ్రిజిరేటర్ వంటి ఉపకారణాలపై ఏకంగా 80% డిస్కౌంట్ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ కామర్స్ దిగ్గజాలు.. ఇక మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఒక ప్రముఖ జర్మన్ బ్రాండ్ కంపెనీ తమ కంపెనీ నుంచి మూడు వేరియంట్లలో 3 టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఆ టీవీల ధరలు , ఫీచర్స్ అన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ప్రముఖ జర్మన్ బ్రాండ్ ఆడియో బ్రాండ్ Blaupunkt ఈరోజు మన భారతదేశం మార్కెట్లో మూడు కొత్త 4K QLED టీవీలను లాంచ్ చేసింది.
ఇక ఈ కొత్త టీవీలు 50,55, 65అంగుళాల పరిమాణంలో కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 23 నుంచి రానున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ఇకపోతే ఈ టీవీలు ఇండియన్ టెక్ మార్కెట్లో రూ.36,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేయబడ్డాయి. ఇకపోతే ఈ కొత్త 4K QLED టీవీల ధర మరియు ప్రత్యేకతలు కూడా కింద లిఫ్ట్ చేయబడింది. ఇక ఈటీవీలో మీకు 60 W హెవీ సౌండ్ అందించగలిగిన స్పీకర్లను డాల్బీ ఆటం సౌండ్ టెక్నాలజీ సపోర్టుతో అందించబడింది. ఇక ఈ టీవీలలో చాలా దూరం నుండి కూడా వాయిస్ ని గుర్తించగల ఫార్ ఫీల్డ్ గూగుల్ అసిస్టెంట్ ను కూడా జత చేశారు.
4K QLED టీవీలు బెజెల్ లెస్, ఎయిర్ స్లిమ్ డిజైన్ తో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు టీవీలు డాల్బీ విజన్ మరియు హెచ్డిఆర్ 10 + సపోర్టుతో వస్తాయి. అంతేకాదు కనెక్టివిటీ పరంగా ఈ టీవీలలో 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ , బ్లూటూత్ 5.0 , డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్లను కూడా కలిగి ఉంటాయి. ఇక 3 వేరియంట్ లలో లభించే ఈ 4K QLED స్మార్ట్ టీవీల ధర విషయానికి వస్తే..50 అంగుళాల వేరియంట్ 4K QLED టీవీ ధర రూ.36,999.. 55 అంగుళాల 4K QLED టీవీ వేరియంట్ ధర రూ.44,999.. 65 అంగుళాల వేరియంట్ 4K QLED టీవీ ధర రూ.62,999 ధరతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.