Smart Phones : అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా బడ్జెట్ ధర లో ఉన్న స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అలాంటి వారికి కొన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ ను తీసుకు రావడం జరిగింది. ముఖ్యంగా 15, 000 రూపాయలు బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని ఒకసారి చదివి తెలుసుకుందాం.
Redmi Note 11 : ప్రముఖ టెక్ దిగ్గజం రెడ్మి నోట్ 11 స్మార్ట్ ఫోన్ 15,000 రూపాయల ధరలో నమ్మదగిన పెర్ఫార్మర్ గా నిలుస్తోంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు సొంతం చేసుకోవచ్చు . ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ఫుల్ హెచ్డి + AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ క్వాడ్ కెమెరాతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
Moto G52 : ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీకు 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. బ్లోట్ వేర్ లేని క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్ కూడా FHD + AMOLED డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా స్టాక్ ఆండ్రాయిడ్ 12 పైన ఆధారపడి పని చేస్తుంది. ఇక ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు 50 మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.
Samsung galaxy M21 : ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీరు 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనుగోలు చేయవచ్చు. పవర్ఫుల్ బ్యాటరీ కోరుకునే వారికోసం ఈ స్మార్ట్ ఫోన్ చాలా నమ్మదగినది ఇక సూపర్ AMOLED స్క్రీన్ తో 48 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉండడమే కాకుండా 20 మెగాపిక్సల్ సెల్ఫీ షూటర్ కూడా అమర్చబడి ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది. ఇక వీటితోపాటు Redmi 10 prime, Realme 9 5G వంటి స్మార్ట్ ఫోన్లు కేవలం రూ.15,000 ధరలో లభిస్తూ ఉండడం గమనార్హం.