Oppo A77 Smart Phone : గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా అమ్మబడుతున్న స్మార్ట్ ఫోన్ల విషయానికే వస్తే ఒప్పో ముందు వరసలో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లను కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో చాలామంది ఒప్పో స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇకపోతే తాజాగా ఒప్పో ఇండియా నుంచి ఇటీవల స్మార్ట్ ఫోన్ కూడా రిలీజ్ అయింది. ఒప్పో ఏ సిరీస్ లో ఒప్పో A77 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది కంపెనీ. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధరలు ఇలా అన్ని విషయాలను ఇప్పుడు మనం ఒకసారి చదివితే తెలుసుకుందాం.
ఒప్పో A 77 4GB ర్యామ్ అలాగే 64GB స్టోరేజ్ వేరియంట్ లో రిలీజ్ అయింది. ఇక మార్కెట్లో దీని ధర రూ.15,499.. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ తో పాటు ఆఫ్ లైన్ స్టోర్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా కలర్స్ విషయానికి వస్తే సన్ సెట్ ఆరెంజ్, స్కై బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేవారు బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది . అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే అమెజాన్ లో 14,650, ఫ్లిప్కార్ట్ లో 14000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ప్రస్తుతం ఒకే వేరియంటలో ఈ మొబైల్ లభిస్తూ ఉండడం గమనార్హం ఇక 60Hz రీఫ్రేష్ రేట్ తో 6.56 అంగుళాల హెచ్డి ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. మీడియా టెక్ హీలియో G35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇకపోతే ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో పాటు డ్యూయల్ కెమెరా సెట్ అప్ కూడా ఉంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించబడింది. ఇక 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇన్ని ఫీచర్లతో రూ.15 వేల లోపు బడ్జెట్ ధరలో ఈ మొబైల్ లభించడంతో ఈ మొబైల్ కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది.