Smart Phone : ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పిల్లల మొదలుకొని పెద్దలు, యువత అందరూ కూడా ఈ స్మార్ట్ఫోన్లోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నారు. ఇక వీరంతా ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్యం విషయం పక్కన పెడితే మొబైల్ లో చార్జింగ్ త్వరగా అయిపోతుందని ఆందోళన కూడా ఎక్కువ అయింది. ఇక అలాంటి వారి కోసం ఇప్పుడు ఏకంగా 12000 హెచ్ బ్యాటరీతో డూగీ అనే ఒక సంస్థ సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. డూగీ నుండి వస్తున్న సరికొత్త డూగీ S89, డూగీ S89 ప్రో స్మార్ట్ ఫోన్లు రెండు కూడా బ్లాక్ అలాగే ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో మార్కెట్లోకి పరిచయం అవ్వనున్నాయి.
ఇక స్టోరేజ్ విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 128 GB స్టోరేజ్ తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ విలువ రూ.24,800 కి సొంతం చేసుకోవచ్చు.. మీడియా టెక్ హీలియో P90 ఇంకా ఆండ్రాయిడ్ 12 తో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చారు. డూగీ S 89 స్మార్ట్ మొబైల్ ధర రూ.24,800 అయితే డూగీ S 89 ప్రో స్మార్ట్ మొబైల్ ధర రూ.28,800. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్లను అలీ ఎక్స్ప్రెస్ అలాగే డూగీ మాల్ వెబ్సైట్లో నుంచి ప్రీ ఆర్డర్ బుకింగ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు 25వ తేదీ నుంచి అమ్మకానికి వచ్చాయి ఈ స్మార్ట్ ఫోన్స్. 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో ..
గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ , 8GB LPDDR4X ర్యామ్, మీడియా టెక్ హీలియో P90 ప్రాసెసర్ తో 128 జీబీ స్టోరేజ్ , ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో వస్తుంది. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో, 20 మెగా పిక్సెల్ నైట్ విజన్ సెన్సార్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కూడా అమర్చబడి ఉన్నాయి. ఫ్రంట్ సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అమరచబడి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 12000 mah బ్యాటరీని అందించారు.15 W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది…డూగీ S 89 ప్రో స్మార్ట్ ఫోన్ అయితే 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 12000mah బ్యాటరీ కలిగి ఉంది.15 W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.