Smart Mobiles : ఇక ఈ మధ్యకాలంలో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోళ్లు ఇండియాలో క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రూ.30వేల ధరతో చాలా కంపెనీలు పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి కెమెరాతో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇకపోతే ఆల్ రౌండర్ అన్ని విభాగాలు మంచి పర్ఫామెన్స్ ఉండే మొబైల్ లను లాంఛ్ చేయడం గమనార్హం. ఇకపోతే రూ.30 వేల లోపు మీరు మొబైల్ కొనాలని అనుకుంటున్నట్లయితే ఇక్కడ చెప్పబోయే కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఒక లుక్ వేయండి.
Poco F4 5G స్మార్ట్ ఫోన్ : ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇక ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎం ఐ యు ఐ 13 ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేయడం గమనార్హం.6.67 ఇంచుల ఫుల్ హెచ్డి , E 4 AMOLED డిస్ప్లే తో 120 Hz రీ ఫ్రెష్ రేట్ తో తో ఈ స్మార్ట్ మొబైల్ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా.. 8 మెగా పిక్సెల్ అలాగే 2 మెగాపిక్సల్ రియల్ కెమెరాలు అమర్చబడ్డాయి. సెల్ఫీ కోసం 20 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. 80 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,500 ఎంహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ మొబైల్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.27,999.
Redmi K50i 5G : ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే తో 144 Hz రీఫ్రెష్ రేట్ తో ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎం ఐ యు ఐ 13 ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేయడం గమనార్హం. కెమెరా విషయానికి 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా పిక్సెల్ అలాగే 2 మెగాపిక్సల్ రియర్ కెమెరాలు అమర్చబడ్డాయి. సెల్ఫీ కోసం 16 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వబడింది. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5080 ఎంఈహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ధర రూ.25,999.
రియల్ మీ 9 ప్రో : ఈ మొబైల్ 50 మెగాపిక్సల్ sony IMX 766 ప్రధాన కెమెరా తో లభిస్తుంది. 6.4 ఇంచుల ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే తో 90 HZ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ రియల్ మీ యు ఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. ఇక 8 మెగా పిక్సెల్ అలాగే 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరాలు కూడా ఉంటాయి. సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరా అమర్చబడి ఉంది. 60 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4500 ఎంహెచ్ బ్యాటరీను కలిగి ఉంటుంది. ఇక దీని ధర రూ.24,999.