Sitara : సితార పోస్ట్ చూసి నా కూతురు బంగారమన్న మహేష్ నమ్రత..! 

Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార స్టార్ కిడ్ గా పరిచయం అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ వేసిన క్రియేట్ చేసుకుంది. ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ చేరుకున్న స్టార్ కిడ్ గా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.. ఇక సితార తన లేటెస్ట్ ఫోటోలతో హంగామా చేస్తూనే ఉంటుంది.. తాజాగా సంక్రాంతి సందర్భంగా ప్రీ సంక్రాంత్రి అంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై మహేష్, నమ్రత పొగడ్తల వర్షం కురిపించారట..

Sitara ghattamaneni latest pics Mahesh namrata reaction
Sitara ghattamaneni latest pics Mahesh namrata reaction

సితార అచ్చ తెలుగు అమ్మాయిలాగా లంగా జాకెట్ లో కనిపించింది వైట్ కలర్ లంగాలో వంకాయ రంగు బ్లౌజ్ వేసుకుని సీతు పాప ముద్దుగా కనిపించింది. సితార ఈ ఫోటోలు చూసిన మహేష్ బాబు నా కూతురు బంగారం అంటూ మెచ్చుకున్నాడట. ఇక నమ్రత కూడా తన ఇంస్టాగ్రామ్ లో సితార ఫోటోలను షేర్ చేసింది. సితార వెండి ధరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు స్టార్ కిడ్ గా పరిచయం అవుతుందా.. లేదంటే ఒకేసారి హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతుందా అనేది చూడాలి.