YS Viveka Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఈనెల ఆఖరికి ముగియనుంది. దీంతో అరెస్టులు తప్పవని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ఉండటంతో రాజకీయంగా ఏం జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మూడుసార్లు వైయస్ అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించింది. పరిస్థితి ఇలా ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి చెల్లెలు వైయస్ విమల రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియో తాజాగా అవుతుంది. ఆ వీడియోలో వైఎస్ వివేకానంద రెడ్డికి వైయస్ ఫ్యామిలీకి బాండింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

వైయస్ చనిపోయిన తర్వాత వదినమ్మ పై వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయటం సంఘటన తప్ప మిగతా సందర్భాలలో ఎక్కడా కూడా ఎవరికి గొడవలు లేవని తెలిపింది. వైయస్ వివేకానంద రెడ్డిని బయటవాలే హత్య చేశారని చెప్పుకొచ్చింది. రాజకీయాల కారణంగా ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్య కేసు విషయంలో వైఎస్ వివేకానంద రెడ్డి పిల్లలు బయట వాళ్ల వ్యక్తుల మాటల నమ్మటం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. వైయస్ అవినాష్ రెడ్డి గెలుపు కోసం.. వైయస్ వివేకానంద రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు.
అయితే వైయస్ వివేకానంద రెడ్డి.. మొదట గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సంఘటన స్థలం వద్ద ఉన్న… అవినాష్ రెడ్డి ఇది గుండెపోటు లాగా లేదు పెద్దమ్మ. ఎవరో హత్య చేసినట్లు తెలుస్తోంది అని మొదట చెప్పింది అవినాష్ రెడ్డి అని వైయస్ విమలమ్మ పేర్కొన్నారు. ఈ హత్య కేసు విషయంలో వైయస్ ఫ్యామిలీ సభ్యులు ఎంతగానో మదన పడుతున్నారని చెప్పుకొచ్చారు. వైయస్ అవినాష్ రెడ్డికి … చంపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అప్పట్లో వైయస్ వివేక హత్యకి సంబంధించి వైఎస్ విమలమ్మ చేసిన వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.