Marriage: భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లాలి.. ఒకరికి కష్టంగా ఉంటే మరొకరు అండగా నిలబడాలి.. ఒకరికి ఒత్తిడిగా ఉన్నప్పుడు మరొకరు ఆ ఒత్తిడిని పోగొట్టాలి.. ప్రతి విషయంలో నేనున్నానంటూ అండగా నిలుస్తూ సంతోషంగా జీవితాన్ని గడపాలి.. అప్పుడే భార్యాభర్తల బంధం ఆనందంగా ఉంటుంది.

కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒత్తిడి అలవాటైపోయింది . వర్క్ ఫ్రం హోమ్ అంటూ భార్య కానీ భర్త కానీ ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేసుకుంటే.. ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినప్పుడల్లా విసుగ్గా అనిపిస్తుంది. వర్క్ టెన్షన్, చిరాకుతో పాటుగా ఒత్తిడి పెరిగిపోతుంది. మీరు వెంటనే ఒత్తిడి నుంచి బయటపడాలి. లేదంటే ఆ చిరాకు , ఒత్తిడి ఇంట్లో వారిపై చూపిస్తారు. ఫలితంగా బంధం బీటలు వారుతుంది.
అందుకే ఇద్దరిలో ఏ ఒక్కరూ ఒత్తిడి ఉన్నా దాని నుంచి బయటపడడానికి పజిల్ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఒత్తిడి అనిపించిన వెంటనే కాసేపు పజిల్ గేమ్స్ ఆడండి. ఒత్తిడి కొన్ని సెకన్లలోనే పోతుంది. అలాగే మీకు మనసు చికాకుగా అనిపించినప్పుడు ఒత్తిడిగా ఉన్నప్పుడు డిప్రెషన్ కి లోనైనప్పుడు సంగీతం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాదు ఒత్తిడి నుంచి తక్షణమే ఉపశమనాన్ని అందిస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు వెంటనే మీకు నచ్చిన పాటలను వినండి.
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ బరువును తగ్గించడానికి మాత్రమే కాదు. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ప్రతిరోజు గ్రీన్ టీ తాగితే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రతి భార్య భర్త ఈ విషయాలు తెలుసుకుని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ మెళుకువలు పాటిస్తే మీ జీవితం అంతా ఆనందమే..