Syam Agarwal Twist : ఇండోర్లో శ్యామ్ అగర్వాల్ అనే కుర్రాడు ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ తన భార్య ప్రియా అగర్వాల్, కూతురిని చాలా సంతోషంగా, బాధ్యతగా చూసుకుంటున్నాడు. ప్రియా అగర్వాల్ ఇంట్లోనే ఉంటూ భర్తని ఆఫీస్ కి పంపిస్తూ కూతుర్ని స్కూల్ కి పంపిస్తూ ఇంటి బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తుంది. ఇక వీళ్ళిద్దరూ వెళ్లిపోగానే తన భర్త కొనిచ్చిన చీరలు నగలు పెట్టుకొని సోషల్ మీడియాలో ఆ పోస్టులను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

వాటిని చూసిన తన భర్త తనని ఖండిస్తూ వచ్చాడు.. అయినా కానీ ప్రియా అగర్వాల్ అవేమీ పట్టించుకోకుండా సోషల్ మీడియానే ప్రపంచంగా బతికేసింది. అంతేకాకుండా తనని బాగున్నావు అని కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. అలా ఓ యువకుడు రాజేష్ రఘువంసి పరిచయమయ్యాడు. వీళ్లిద్దరూ పర్సనల్ చాట్ చేసుకుంటూ ఓ రెండేళ్ల పాటు ఏకాంతంగా కూడా దగ్గరయ్యారు. అక్రమ బంధానికి దారి తీసింది. ఇక భర్త ఆఫీస్ కి వెళ్ళగానే రాజేష్ ని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది ప్రియా అగర్వాల్ ఒకరోజు మధ్యాహ్నమే ఇంటికి వచ్చిన తన భర్తకి ప్రియా ఇండైరెక్టుగా తన ప్రియుడితో గడుపుతున్నట్లు దొరికేసింది. నువ్వు తప్పు చేస్తున్నావు అంటూ భర్త నిలదీయగా.. అలాంటిది ఏమీ లేదు అని ప్రియ రెండు రోజులు అన్నం తినటం మానేసింది. ఇక దాంతో నా భార్య అలాంటిది కాదు అనుకుని తను కూడా తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు.
ఇక తన ఇంట్లో కాకుండా రాజేష్ రూమ్ దగ్గరికే వెళ్లేది ప్రియ ఇక కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేస్తున్నానంటూ ఎక్కువ సేపు రాజేష్ తో సమయం గడిపేది. ఇక అలా తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను సంతోషంగా చేయలేకపోతున్నావంటూ తనని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక ఆ మాటలకు రాజేష్ మనసు నొచ్చుకుంది. అంతేకాకుండా తనని దూరం పెడుతూ వచ్చింది ప్రియా. ఒకరోజు తనని కలవమని రాజేష్ తన కుటుంబ సభ్యులు ఇంటికి రావడంతో ప్రియా వస్తానని చెప్పినా కూడా చాలా ఆలస్యంగా అతని దగ్గరికి వెళ్ళింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న రాజేష్ తన దగ్గరకు రాగానే ఆమెను కసకస కత్తితో పొడి చేశాడు.
ఆ దృశ్యాలను చూసిన ప్రియా కూతురు పక్కనే ఉన్న షాప్ అతనికి వెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా.. పోలీసులు హాస్పటల్కి ప్రియని తీసుకువెళ్లేసరికే చనిపోయింది. ఇక ఇదే విషయం గురించి తన భర్తను ఆరతిగా ప్రియా గురించి నాకు అంతా తెలుసు అని నా కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ప్రియా ఇప్పటివరకు చేస్తున్నవన్నీ భరించానని చెబుతాడు. భర్తలు చేసే మోసంలో భార్యలు భరిస్తున్నప్పుడు భార్యలు చేసే తప్పులను కూడా భర్తలు భరించాలని చెప్పి శ్యామ్ అందరి మనసులను గెలుచుకున్నాడు.