Sania Mirja : వెక్కి వెక్కి ఏడుస్తోన్న సానియా మీర్జా కొడుకు .. ” అమ్మా నాన్నా విడిపోవద్దు ” అంటూ — ఐనా కనికరించని సానియా.?

Sania Mirja : సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు విడిపోతున్నారంటూ గత కొద్ది కాలంలో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్లు.. సానియా దంపతులకు అత్యంత సన్నిహితులు ఒకరు చెప్పారు.. వారు తమ దాంపత్య జీవితానికి ముగింపు పలకాలని ఇప్పటికే ఇద్దరు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.. ఇక కేవలం ఫార్మలిటీ న్యాయపరమైన ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది..!

Shoyab Malik son ijahan worrying about her mom Sania Mirza
Shoyab Malik son ijahan worrying about her mom Sania Mirza

ఇప్పటికే వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారని త్వరలోనే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు సన్నిహితులు పేర్కొన్నారు. మరోవైపు షోయబ్ మాలిక్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లోని సభ్యుడు ఒకరు కీలక విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సానియా దుబాయిలో ఉండగా.. షోయబ్ మాలిక్ పాకిస్తాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తమ కుమారుడు ఇజహన్ బర్త్ డే ఫోటోలను షోయబ్ షేర్ చేయగా.. సానియా మాత్రం అస్సలు పోటోనే షేర్ చేయలేదు. దీనిని బట్టి చూస్తే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని క్లారిటీ వచ్చింది.

అయితే విడాకులు తీసుకుంటే కొడుకు తండ్రికే చెందుతాడు. ఈ ప్రకారంగా షోయబ్ మాలిక్ తన కొడుకుని తన దగ్గరే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. సానియా మీర్జా కోసం ఇజహన్ ఏడుస్తున్నట్టు తెలుస్తోంది. అమ్మా నాన్నా విడిపోవద్దు అంటూ ఇజహన్ ఏడుస్తున్నా.. సానియా తన కొడుకుని షోయబ్ దగ్గరే వదిలేసి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.