Sharwanand: శర్వానంద్ ఏదో అల్లాటప్పా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకున్నారా .. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లోయింగ్ !

Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ కూడా ఒకరు.. కాగా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేస్తూ రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఇటీవల హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో.. ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రెటీలు ఇరువురి కుటుంబ సభ్యులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది..

Sharwanand Rakshitha reddy bio net worth
Sharwanand Rakshitha reddy bio net worth

శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అంతేకాకుండా వీరిది పెద్దలకు తీర్చిన సంబంధం అని సమాచారం. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె ర‌క్షిత.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా వధువు.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు..

రక్షిత రెడ్డి వెనుక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సమాచారం. తన తండ్రి కూడా పెట్టిన ఆస్తులతో పాటు తన తాతల తరం నుంచి వస్తున్న ఆస్తులు కూడా రక్షిత పేరు మీద ఉన్నాయట.. మొత్తంగా శర్వానంద్ వేలకోట్ల ఆస్తి ఉన్న రక్షిత మెడలో తాళికట్టనున్నాడు.. మొత్తానికి సౌండ్ పార్టీ అయిన రక్షిత ను శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు.

అలా అని మన శర్వానంద్ వెనుక కూడా బోలెడు ఆస్తులు ఉన్నాయి. శర్వానంద్ తన 17వ ఏట నుంచి ఇంట్లో డబ్బులు తీసుకోవడం మానేసాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు తానే సొంతంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీయగలిగే కెపాసిటీ కూడా ఉందని చెప్పారు. దీనిని బట్టి చూస్తే శర్వానంద్ కి తగిన సంబంధమే దొరికినట్లుగా అనిపిస్తుంది. శర్వానంద్ రక్షిత రెడ్డిల పెళ్లి తేదీని ఇరు కుటుంబాల వారు త్వరలోనే ప్రకటించనున్నారు. బహుశా ఈ వేసవిలో వీరి వివాహం జరగనుందని సమాచారం.