Sharukh Khan.. బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ భార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. అబ్బాయిల కన్నుల రాకుమారి.. ఫ్యాషన్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్ పై ముంబైకి చెందిన ఒక రెసిడెంట్ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయించారు. ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా సమాచారం అందుతోంది. లక్నోలో ఒక అపార్ట్మెంట్ల కంపెనీకి గౌరీకాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.. గౌరీ ఖాన్ ను చూసే తాను అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నానని జస్వంత్ షా అనే రెసిడెంట్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే కంపెనీ తన ఫ్లాట్ సకాలంలో అందించడంలో ఫెయిల్యూర్ అయిందని.. తాను చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని జస్వంత్ షా పేర్కొన్నారు.
ఫ్లాట్ కోసం తన వద్ద రూ.86 లక్షలు వసూలు చేసిందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. డబ్బు చెల్లించినా కూడా ఫ్లాట్ ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలో తులసియాని గోల్ఫ్ వ్యూ లో ఫ్లాట్ ఉందని ఫిర్యాదుదారుడు తెలిపారు. తనకు ఫ్లాట్ ఇవ్వకపోగా ఆ ఫ్లాట్ ను వేరొకరికి ఇచ్చిందని తన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని ఆయన తెలిపారు. తులసియాని కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని , డైరెక్టర్ మహేష్ తులసియాని పై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 409 ఉల్లంఘన కేసులో గౌరీ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.