Civil Interview : గ్రూప్ పరీక్షలలో అత్యంత క్లిష్టమైనది సివిల్స్. ఎంతో కష్టపడి చదివితే గాని సివిల్స్ లో ర్యాంక్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇక సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించటం ఓ ఎత్తు అయితే… సివిల్స్ కి క్వాలిఫై అయ్యే ఇంటర్వ్యూ మరో ఎత్తు. ఇక్కడ అర్హత సాధించాలంటే కేవలం పుస్తక పరిజ్ఞానం ఉంటే సరిపోదు. తెలివితేటలు అదే విధంగా సమయస్ఫూర్తి నిండుగా ఉండాలి. ఏమాత్రం సివిల్స్ ఇంటర్వ్యూలో తేడా వచ్చిన సరే… మీరు ఈ జాబుకి అర్హులు కారు అని సర్టిఫికెట్లు వెనక్కి ఇచ్చి పంపించేస్తారు. స్టేట్ ర్యాంక్ వచ్చిన గాని సివిల్స్ ఇంటర్వ్యూలో రాణించకపోతే అట్నుంచి అటే పంపించేస్తారు. ఇదిలా ఉంటే కర్ణాటకలో 30 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి సివిల్స్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి.. ఇంటర్వ్యూ ఎదుర్కోవటం జరిగింది. ఎప్పటినుండో సివిల్స్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని కటోర శ్రమతో రాత్రి పగలు చదివి.. ర్యాంకు సాధించింది. ర్యాంకు రావటంతో ఇంట్లో తల్లిదండ్రులు అంతా సంతోషంగా ఫీల్ అయ్యి కచ్చితంగా ఐఏఎస్ సాధిస్తుందని బలంగా నమ్మారు.

ఈ క్రమంలో సదరు అమ్మాయి ఇంటర్వ్యూకి సిద్ధమయింది. ఇంటర్వ్యూలో అడిగే ప్రతి ప్రశ్నకు గుక్క తిప్పుకోకుండా సమాధానాలు చెప్పింది. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులలో ఒకరు అమ్మాయిని ఇరుకున పెట్టాలని చాలా లాజికల్ ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే మీ భర్త చనిపోయాడు… అందుకే మీరు రెండో పెళ్లి చేసుకున్నారు.. ఈ క్రమంలో ఆనందంగా గడుపుతున్న సమయంలో చనిపోయిన మొదటి భర్త తిరిగి వస్తే మీరు ఏం చేస్తారు. ఈ ప్రశ్నకి అమ్మాయి చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఆమె చెప్పిన జవాబు ఏమిటంటే.. మీరు అడిగినట్టుగా చనిపోయిన నా మొదటి భర్త తిరిగి వచ్చాడు అని అనుకుంటే.. మన దేశ చట్టాల ప్రకారం భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవచ్చు.
అదే ఒకవేళ ఆ భర్త ప్రమాదవశాత్తు చనిపోతే.. చావు ధ్రువీకరించిన వైద్యుడు దగ్గర నుండి డెత్ సర్టిఫికెట్ తీసుకుని… దాని ఆధారంగా రెండో వివాహం చేసుకోవచ్చు. అలా పెళ్లి చేసుకోవటం చట్టబద్ధం అవుతుంది కాబట్టి మీరన్నట్టు చనిపోయిన నా భర్త తిరిగి వచ్చిన… చట్ట ప్రకారం ఆ రెండో పెళ్లి విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. దీంతో ఇక ఎవరితో కాపురం చేయాలి అనేది నా మనసుకు సంబంధించిన విషయం… సమాధానం చెప్పటంతో ప్రశ్న అడిగిన సీనియర్ అధికారి షాక్ అయ్యారు. జవాబు విని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు. అయితే సదరు అమ్మాయికి చట్టాలపై ఎంత అవగాహన ఉంది అన్న దానిపై ప్రశ్న వేయడం జరిగింది.