ప్రముఖ టెక్ దిగ్గజం అయిన సాంసంగ్ ఇండియాలో బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్ ను లాంచ్ చేసింది. అందులో భాగంగా స్మార్ట్ టీవీల పై అనేక ఆఫర్లను ప్రకటిస్తూ ఉండడం గమనార్హం. ఇండియాలో దసరా, దీపావళి అంటూ ఫెస్టివల్ సీజన్ మొదలైన నేపథ్యంలో వివిధ వ్యాపార సంస్థలు కూడా తమ బిజినెస్ ని పెంచుకోవడానికి స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్స్ ను అనౌన్స్ చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే సాంసంగ్ కూడా బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్ అంటూ ఒక సేల్ ను లాంచ్ చేసింది. ఇందులో స్మార్ట్ టీవీలపై అనేక ఆఫర్లు కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా పండుగ ఆఫర్లో కస్టమర్లు సాంసంగ్ టీవీలు కొనుగోలు చేస్తే వారికి విలువైన సాంసంగ్ స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందివ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది.
అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మీకు అందుబాటులో ఉంటుంది.. ఇకపోతే మీరు సాంసంగ్ నిర్వహిస్తున్న ఈ స్పెషల్ సేల్ లో.. సాంసంగ్ ప్రీమియం, లార్జ్ స్క్రీన్ నియో క్యూ ఎల్ఈడి 8కె, క్యూ ఎల్ఈడి, ద ఫ్రేమ్ అండ్ క్రిస్టల్ ఫోర్ కె అల్ట్రా హెచ్డీ టీవీలు వంటి మోడల్ టీవీ లను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ టీవీలు కొనుగోలు చేయడం వల్ల మీకు ఉచితంగా విలువైన స్మార్ట్ ఫోన్స్ కూడా లభిస్తాయి. ఇకపోతే ఎలాంటి స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయడం వల్ల మనకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా లభిస్తుంది..
అంటే 65 అంగుళాల నియో క్యూ ఎల్ఈడి 8k టీవీ.. 55, 65, 75 , 85 అంగుళాల నియో క్యూ ఎల్ఈడి టీవీ, అలాగే 75 , 85 అంగుళాల క్యూ ఎల్ఈడి టీవీ, మరియు 75 , 85 అంగుళాల క్రిస్టల్ 4k UHD టీవీ, ఇక 75 అంగుళాల ఫ్రేమ్ టీవీలలో ఏదైనా ఒక మోడల్ మీరు కొనుగోలు చేస్తే ఆ కస్టమర్లకు రూ.21,490 విలువచేసే గెలాక్సీ A32 స్మార్ట్ ఫోన్ ఉచితంగా అందిస్తున్నారు. ఇక 55 అంగుళాల క్యూ ఎల్ఈడి టీవీని తీసుకుంటే రూ.9,499 విలువచేసే సాంసంగ్ గెలాక్సీ A03 స్మార్ట్ ఫోన్ ను ఫ్రీగా అందజేయనున్నారు. ఇక 50 అంగుళాల నియో క్యూ ఎల్ఈడి టీవీ ను కొనుగోలు చేస్తే .. రూ.8,990 విలువచేసే సాంసంగ్ అల్ట్రా స్లిమ్ కెమెరాను కూడా ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాదు 98 అంగుళాల నియో క్యూ ఎల్ఈడి టీవీ ని కొనుగోలు చేస్తే రూ.1,09,999 విలువ చేసి గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.