Samsung Mobiles : ఇకపోతే శాంసంగ్ మొబైల్ కంపెనీ భారత మార్కెట్లో క్రమంగా తమ ఉత్పత్తులను విస్తరింపజేసే నేపథ్యంలో కస్టమర్లను.. వారి ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంత ఎక్కువ ధర కే స్మార్ట్ ఫోన్లను అందించడానికి సిద్ధమయింది. మరీ 10వేల రూపాయల లోపల లభించే బడ్జెట్ సాంసంగ్ మొబైల్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
సాంసంగ్ గాలక్సీ A04 : ఇకపోతే సామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను ఇంకా ప్రకటించలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం.. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ ధర రూ.10,499 గా ఉండవచ్చని తెలుస్తోంది. ఇక బ్లాక్, కాపర్, వైట్, గ్రీన్ మొత్తం 4 రంగుల ఎంపికలలో ఈ ఫోన్ ప్రారంభించబడినట్లు సమాచారం. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో 6.5 అంగుళాల ఎల్సిడి ఇన్ఫినిటీ V డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. 60 HZ రీఫ్రెష్ రేట్ ను కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో 8GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లభిస్తుంది. ఇక మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ను 1TB వరకు మీరు పెంచుకోవచ్చు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

50 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రైమరీ షూటర్ అలాగే 2 మెగాపిక్సల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ కెమెరా ఇస్తున్నారు. ఇక సెల్ఫీ కోసం 5 మెగా పిక్సెల్ కెమెరా లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ M13 5G : ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో లభిస్తుంది. 60 Hz రీఫ్రెష్ రేట్ తో, 4GB+64 GB అలాగే 6GB +128 GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. 50 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రైమరీ షూటర్, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో డెప్త్ సెన్సార్ కూడా అందిస్తున్నారు. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది. నిజానికి ఈ స్మార్ట్ ఫోన్ రూ.15,999 ధరలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యాంక్ ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.