Samsung Galaxy Z Fold 4 : ప్రస్తుతం మార్కెట్లోకి అధునాతన స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఎన్నో స్మార్ట్ ఫోన్లు కస్టమర్లకు దగ్గర అవుతున్నాయి. ఇక సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన డిజైన్లతో కస్టమర్లు కోరుకున్నట్టుగానే స్మార్ట్ ఫోన్లు విడుదలవుతూ ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి సాంసంగ్ నుంచి త్వరలోనే ఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఆగస్టు 16 తేదీన నిర్వహించబోయే గెలాక్సీ అండ్ ప్యాక్డ్ ఈవెంట్లో ఈ దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్ గాలక్సీ Z fold 4 అలాగే గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 4 వంటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనుంది. ఇక ఈ హ్యాండ్ సెట్ల స్పెసిఫికేషన్ లు, డిజైన్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో పుకార్లు బయటకు వచ్చాయి. ఇకపోతే సామ్సంగ్ ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని కూడా వెల్లడించకపోవడం గమనార్హం.
కానీ తాజాగా అందుతున్న గూగుల్ నివేదికల ప్రకారం గాలక్సీ Z Flip 4 అనూహ్యంగా 70 కలర్ వేరియంట్లలో లభించనున్నట్లు తాజాగా వెల్లడించింది సాంసంగ్. ముఖ్యంగా సాంసంగ్ కేర్ ప్లస్ అని.. కంపెనీ తమ వెబ్సైట్లో ఈ విషయాలను కనుగొన్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి కంపెనీ తమ అధికారిక వెబ్సైట్లో ప్రీ రిజర్వ్ బుకింగ్స్ ని కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇలా ప్రీ రిజర్వ్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సుమారుగా రూ.5000 వరకు ప్రయోజనాలు ఉంటాయి అని కంపెనీ స్పష్టం చేసింది. ఇక ఈ గ్యాలక్సీ Z Flip 4 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ 128gb అలాగే 256 జిబి స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుందని సమాచారం. ముఖ్యంగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫోల్డబుల్ స్మార్ట్ మొబైల్ లో 512 GB స్టోరేజ్ వేరియంట్ ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక గ్యాలక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ ఆగస్టు 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ET/IST ప్రకారం సాయంత్రం 6:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఇకపోతే ఈ ఈవెంట్లో గెలాక్సీ వాచ్ 5, గెలాక్సీ బడ్స్ 2 ప్రో తో పాటూ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఫోర్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోర్ లను సామ్సంగ్ ఆవిష్కరించనుంది. ఇకపోతే సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఫోర్ Gen 2 ట్రాన్సిట్ ఫీచర్లతో పనిచేస్తాయని సమాచారం. ఇక కెమెరా విషయానికి వస్థే.. 12 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాతో పాటు 12 మెగా ఫిక్సల్ అల్ట్రా వైడ్ స్నాపర్ని కూడా కలిగి ఉంటుంది . ఇక 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇకపోతే 25 వాట్ వైర్డ్ అలాగే 10 వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇచ్చే 3700 ఎం ఏ హెచ్ బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది.