Samsung Galaxy Watch 5 : ప్రముఖ టెక్ దిగ్గజం అయినటువంటి సాంసంగ్ కేవలం స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలను మాత్రమే కాదు స్మార్ట్ అప్లియన్స్ అన్నిటిని కూడా ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోని స్మార్ట్ వాచ్ లను కూడా సరికొత్త స్మార్ట్ ఫీచర్లతో విడుదల చేసి మరింతగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది ఇక తాజాగా samsung galaxy వాచ్ 5 సిరీస్ ను విడుదల చేసింది. ముఖ్యంగా ఈ స్మార్ట్ వాచ్లు , డిజైన్, ఫీచర్స్ మొత్తం పనితీరు పరంగా అనేక అప్డేట్లను కలిగి ఉన్నాయి. ఇకపోతే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 అలాగే వాచ్ 5 ప్రో రెండూ కూడా సాఫైర్ క్రిస్టల్ బాడీని కలిగి ఉన్నాయి. ఇక సాంప్రదాయ గ్లాస్ బాడీ కంటే మెరుగైన మన్నిక ను అందిస్తాయి. అంతేకాదు ప్రో మోడల్ లో టైటానియం ఫారం ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక ఫీచర్లు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
సాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 : రెండు వేరియంట్లలో లభిస్తుంది..44 mm వేరియంట్ తో 450X450 పిక్సల్స్ రెజల్యూషన్ తో 1.4 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది Wear OS 3.5 ఆధారిత One UI watch 4.5 ఓఎస్ పై రన్ అవుతుంది. ఇక మరొక వేరియంట్ విషయానికి వస్తే 40 mm వేరియంట్ 390X390 పిక్సెల్ రెజల్యూషన్ తో 1.2 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక రెండు వేరియంట్స్ కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ను కలిగి ఉంటాయి. ఇక డ్యూయల్ కోర్ Exynos W920 SoC ప్రాసెసర్ 1.5 GB ర్యామ్ తో పనిచేస్తుంది.
ఇక కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, ఎలక్ట్రికల్ హార్ట్ సిగ్నల్ మరియు బయో ఎలక్ట్రికల్, ఇంపెండెన్స్ అనాలసిస్ ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇక ఇది హార్ట్ బీటింగ్ రేట్, మానిటరింగ్ సెన్సార్ తో పాటు SpO 2 హెల్త్ ట్రాకర్ సదుపాయాలు కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు బెరోమీటర్, గైరోస్కోప్ , యాక్సిలరోమీటర్, కంపాస్ మరియు లైట్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇక 5.2 బ్లూటూత్ వెర్షన్ ను కలిగి ఉంటుంది. బ్యాటరీ 13 శాతం పెద్దదిగా 8 నిమిషాల ఛార్జింగ్ ఎనిమిది గంటల స్లీప్ ట్రాకింగ్ కూడా అందిస్తుంది.. ఇక సాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 ప్రో కూడా ఇలాంటి ఫీచర్స్ ని కలిగి ఉండడం గమనార్హం. కాకపోతే అందులో కొంచెం అప్ గ్రేడెడ్ ఫీచర్స్ వస్తాయని కంపెనీ తెలిపింది.