Samsung Galaxy S23 : శామ్సంగ్ నుంచీ సరికొత్త ఆవిష్కరణ..200 ఎంపీ కెమెరా సెట్ అప్..!!

Samsung Galaxy S23 : ప్రముఖ Samsung తాజాగా గ్యాలక్సీ S22 అల్ట్రా యొక్క సక్సెస్ గా పేర్కొంటున్న రాబోయే గ్యాలక్సీ S23 లైనప్ ను ఈ ఎడాది పరిచయం చేసే అవకాశాలున్నట్లు అంతా భావిస్తున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క 3D సోనిక్ మ్యాక్స్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ టెక్నాలజీని కూడా ఉపయోగించగలదని ఒక టిప్ స్టర్ పేర్కొన్నారు. ఇక కొరియాకు చెందిన ఐటీ న్యూస్ యొక్క నివేదిక ప్రకారం సామ్సంగ్ గాలక్సీ S23 అల్ట్రా సిరీస్ సెన్సార్ తో మార్చబడిన ఏకైక హ్యాండ్ సెట్ కావచ్చు. ఇక సాంసంగ్ మొబైల్ ఎక్స్పీరియన్స్ విభాగం ఈ సమాచారాన్ని కంపెనీ యొక్క ప్రధాన కెమెరా భాగస్వాములకు తెలియజేసింది అని నివేదిక వెల్లడించింది.

Advertisement

200 మెగాపిక్సల్ సెన్సార్ కోసం భాగాలను అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలను నియమించినట్లు తాజా నివేదికలో వెల్లడించారు. ఈ క్రమంలోనే శాంసంగ్ ఎలెక్ట్రో మెకానిక్ , సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే 200 మెగా పిక్సెల్ కెమెరాలను ఉత్పత్తి చేస్తున్నాయని ఇక శాంసంగ్ చివరిగా కెమెరా ఆపరేటర్ గాలక్సీ S20 అల్ట్రా లో 108 మెగా పిక్సెల్ సెన్సార్ ను పరిచయం చేసింది. ఇప్పుడు గ్యాలక్సీ S21 అల్ట్రా, గాలక్సీ S22 అల్ట్రా కూడా 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాను కొనసాగింపు చేశాయి. ఈ కొత్త మొబైల్ లో ఉపయోగిస్తున్న సెన్సార్ సహాయంతో 8K వీడియోలను కూడా సులువుగా రికార్డు చేయవచ్చు. తక్కువ దూరాల్లో కూడా ఇది సాధ్యమవుతుందని సాంసంగ్ వెల్లడించింది. అంతేకాదు సాంసంగ్ యొక్క ఈ సెన్సార్లను ప్రపంచంలోనే అనేక స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఉపయోగించవచ్చును కూడా చెప్పబడింది.

Advertisement
samsung galaxy s23 ultra series launch date in india
samsung galaxy s23 ultra series launch date in india

ఇక తాజాగా స్మార్ట్ ఫోన్ కెమెరాల తయారీలో శాంసంగ్ చాలా ముందు ఉంటుందని చెప్పవచ్చు. ఇక శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సెన్సార్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్యున్ చాంగ్ ఇటీవలె సామ్సంగ్ హై రెజల్యూషన్ టెక్నాలజీలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న లోపాలను అధిగమించడానికి అల్ట్రా ఫాస్ట్ ఆటో ఫోకస్ ను ఉపయోగించడం ద్వారా కంపెనీ తదుపరితరం అనుభవాన్ని అందించడంలో ఆశ్చర్యం లేదు అని చెప్పవచ్చు. గాలక్సీ S23 అల్ట్రా కోసం సాంసంగ్ వెల్కమ్ యొక్క త్రీడి సోనిక్ మాక్స్ ఫింగర్ ప్రింట్, స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఘననీయంగా అన్లాక్ సమయాన్ని కూడా తగ్గిస్తుంది అని తాజా నివేదికలో వెల్లడైంది.

Advertisement