Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడిప్పుడే ఆమె పరిస్థితి మళ్ళీ కుదుట పడింది.. కాగా సమంత సోషల్ మీడియాలో మళ్ళీ యాక్టిివ్ అవుతుంది. తాజాగా సమంత పోస్ట్ చేసిన నెట్టింట వైరల్ అవ్వడంతో పాటు విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి..
శాకుంతలం ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న సంగతి సమంత.. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. కాగా సమంత అందం తగ్గిందని, మునుపటిలా లేదంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వారికి గట్టిగానే కౌంటరిచ్చింది. ఇక సోషల్ మీడియాలో మునుపటిలా యాక్టివ్ గా మారింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.
తాజాగా ఇన్ స్టాలో మరో పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియోలో సామ్ జిమ్ లో కుస్తీలు పడుతుంది. తన వర్కుట్స్ వీడియో షేర్ చేస్తూ.. స్పెషల్ నోట్ రాసుకొచ్చింది. లావుగా ఉన్న మహిళ ఇది చేసే వరకు ముగియదు.
బలం అంటే మనం తీసుకునే ఆహారం ఇమ్యూనిటీ ఫుడ్ కాదు.. మనం ఎలా ఆలోచిస్తామో అదే మన బలం.. అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. సమంత వర్కవుట్స్ చేస్తున్న వీడియో వైరలగా మారింది. జిమ్ చేసి మళ్ళీ ప్రాణం మీదకి తెచ్చుకోకు అని సమంత ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.. మళ్ళీ నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేము. ఇలాంటి జిమ్ వర్కౌట్ చేయద్దని పోస్టులు చేస్తున్నారు.