Samnatha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మళ్ళీ యాక్టివ్ అవుతుంది. తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెడుతుంది. కాగా సోషల్ మీడియాలో సమంత పై మళ్ళీ హ్యుజ్ నెగెటివిటీ మొదలైంది.. ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చింది..

ఈ విషయమే సినిమా కి హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసింది. అయితే మరోసారి అలాంటి స్ట్రాటజీతోనే సమంత రంగంలోకి దిగినట్లు టాక్ . సమంత నటించిన శాకుంతలం మరి కొన్ని రోజుల్లో విడుదల కానుంది.. ఇక ఖుషీ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా పాల్గొనుంది. సమంత తనకు కావాల్సిన పబ్లిసిటీ, పాపులారిటీ కోసం మళ్లీ జనాలతో ఇంటరాక్ట్ అవుతుందని సోషల్ మీడియాను వాడుకుంటూ తన సినిమాని పబ్లిసిటీ చేసుకోవడానికి ట్రై చేస్తుందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఇదొక్కటే కాదు సమంతకి ముందు నుంచి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని.. దానికోసమే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వచ్చిందని .. ఇక నాగచైతన్య తో పెళ్ళి కూడా అందులో భాగమేనని.. తనని సినిమాలకు దూరంగా ఉండమనడంతో ఆ క్రేజ్ పోతుందన్న భయంతో చైతూ కి విడాకులు ఇచ్చేసి .. సింగిల్ గా ఆమె స్ట్రాటజీలను అమలు చేస్తుందని కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.. అయితే ఇందతా సమంత నాగచైతన్యను కలపడానికి ఒక స్ట్రాటజీగా నెటిజన్స్ వాడుతున్నారట.