Samantha: సమంత యశోద సినిమా తర్వాత విడుదల చేయబోతున్న మరో పాన్ ఇండియా చిత్రం శాకుంతలం.. గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చేనెల అంటే ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ కూడా చెబుతున్నారు

ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. ఆ కారణంగా కూడా అంచనాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా లేదా అనేది చూడాలి. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత అదృష్టం మరియు కథ గురించి ముఖ్యంగా జరగబోతుందని సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇటీవల విడుదలైన యశోద సినిమాతో మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈమె అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శాకుంతలం హిందీ డబ్బింగ్ రైట్స్ తో సమంత ఊర మాస్ ఊచకోత కోస్తోందని చెప్పవచ్చు.
శాకుంతలం బిజినెస్ ఎంతో తెలిస్తే నాగ చైతన్యకి ఈ రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు.. ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ప్రచారం. అంతేకాదు ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ తో కూడా నిర్మాతలకు రూ.50 కోట్ల వరకు వచ్చిందని.. సినిమా విజయం సొంతం చేసుకుంటే మరో రూ.100 కోట్లు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని సమాచారం.